Play Cards : పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Play Cards : పేకాట స్థావరంపై పోలీసుల దాడి

వలిగొండ , మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారాన్ని పోలీసులకు అందించగా విశ్వసనీయ సమాచారం మేరకు మూకుమ్మడిగా దాడి చేసి ఎనిమిది మంది పై కేసు నమోదు చేయడం జరిగింది.

 

Also Read : Rythu Bandhu scheme : రైతుబంధుపై కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్…!

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీసీ కాలనీలో ని మధుగాని దాసు ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారంతో శుక్రవారం రోజు రాత్రి 8 గంటల 40 నిమిషాలకు ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తన బృందంతో ఆ ఇంటి పై దాడి చేసి ఏ1_ఏ8 వరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

 

Also Read : Forest Jobs : టెన్త్, ఇంటర్ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం..!

 

వారి వద్ద నుంచి 14790 రూపాయల నగదును ఐదు స్మార్ట్ ఫోన్స్ ను, రెండు సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనపరుచుకున్నారు. వారిని క్రిమినల్ నెంబర్ 165 పై 2023 చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వలిగొండ ఎస్సై పెండ్యాల ప్రభాకర్ హెచ్చరించారు.