పోలీస్ స్టేషన్ లో యువకులు వీరంగం…!

మద్యం మత్తులో ఇరువురు యువకులు పోలీస్ స్టేషన్ లో వీరంగం సృష్టించారు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని... వారు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా... పిలిపించారు.

పోలీస్ స్టేషన్ లో యువకులు వీరంగం…!

స్టేషన్ గోడ నుంచి దూకి పరారు.

పోలీసుల పై దురుసు ప్రవర్తన… స్టేషన్ ను వీడియో తీస్తూ బెదిరింపులు

నేలకొండపల్లి, మన సాక్షి:

మద్యం మత్తులో ఇరువురు యువకులు పోలీస్ స్టేషన్ లో వీరంగం సృష్టించారు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని… వారు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా… పిలిపించారు. అంతే ఇక పోలీసులకు చుక్కలు చూపించారు…. తాగిన మైకంలో దురుసుగా ప్రవర్తించటం, స్టేషన్ ను వీడియో తీస్తూ హల్ చల్ చేశారు…

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని చెరువుమాధారం గ్రామానికి చెందిన ఇరువురు యువకులు మద్యం సేవించి
తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుండటంతో వారి కుటుంబ సభ్యులు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈమేరకు స్థానిక పోలీసులు ఇరువురు యువకులను బుధవారం పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.

ALSO READ : Guntur karam : గుంటూరుకారం సినిమా విలన్స్ పేర్లలో వివాదం.. ఆందోళనలకు సిద్ధం..!

కానీ అప్పటికే మధ్యం మతులో ఉన్న సదరు యువకులుపోలీస్టేషన్ లో వీరంగం సృష్టించారు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు ఎంతగా వారించినా వినకుండా స్టేషన్ లో చోరబడి స్టేషన్ మొత్తం ను వీడియో తీస్తూ….మీ సంగతి చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఒక దశలో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా స్టేషన్ గోడ దూకి పారిపోయి మళ్లీ తిరిగి వచ్చారు.

పోలీసుల పై రాళ్లు విసిరేందుకు కూడ ప్రయత్నించారు. ఆరుపులు, కేకల మధ్య స్టేషన్ ఆవరణ ను రచ్చ రచ్చగా చేశారు. చివరకు తట్టుకోలేక తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లి పోమ్మని చెప్పినా పోకుండా గేటు పట్టుకుని దూకటం, రోధించటం, అరుపులు, కేకలతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. కాగా వారు ఇంటికి వస్తే తమకు ఇబ్బంది అని తల్లిదండ్రులు తీసుకెళ్లటానికి నిరాకరించారు. వీరికి చేసేది లేక ఎట్టకేలకు ఇరువురు యువకులను బంధించారు.

ALSO READ : Anganwadi : అంగన్వాడి టీచర్ మృతి..!