విద్యుత్ షాక్ తో  వ్యక్తి మృతి, న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్

విద్యుత్ షాక్ తో  వ్యక్తి మృతి, న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్

మహేశ్వరం,

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల పరిధిలోని రాచులూరు గ్రామం బైరాగి గూడా గ్రామానికి చెందిన ఊదరి అనిల్ కుమార్ విధి నిర్వహణలో భాగంగా అనిల్ కుమార్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కి పనిచేస్తుండగా విద్యుత్  (ఎల్ సి)  ఆన్ చేయడంతో కరెంటు స్తంభం పైన షాక్ తగిలింది.

 

ALSO READ : Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!

 

అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు .అనిల్ కుమార్ (30) తాత్కాలికంగా విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగా గురువారం నాడు విధులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ అధికారులకు చెప్పి విద్యుత్తును ఆఫ్ చేసి వచ్చి పని చేస్తుండగా ఇంతలో ఇతర విద్యుత్ అధికారులు విద్యుత్ ఆన్ చేయడంతో షాక్ తో అనిల్ కుమార్ మృతి చెందాడు.

 

అతనికి పెళ్లయి 10 నెలలు అవుతుంది. అనిల్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియ ఆస్పత్రికి తరలించడం జరిగిందని కందుకూరు పోలీసులు తెలిపారు.ఇంకా పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.