విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం..!

విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఈ ఘటన పర్వతగిరి మండలం మోత్య తండాలో జరిగింది. మంగళవారం దుర్గమ్మ పండుగ చేయాల్సి ఉండగా వీరంతా విద్యుత్ షాక్ కు గురయ్యారు. విద్యుత్ షాక్ కు గురైన వారిలో మొత్తం నలుగురు యువకులు ఉన్నారు.

భూక్య దేవేందర్ అక్కడికక్కడే మృతిచెందగా గాయాలతో ఉన్న సునీల్ , రవిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. తండ్రి , కొడుకు , అల్లుడు మృతి చెందారు. ఏడేళ్ల బాలుడు యశ్వంత్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆ బాలుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. షాక్ గురైన సంఘటన తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నాగరాజు బాధితుల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ALSO READ : BRS FIRST LIST : బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్..!