ప్రజా గర్జన సభకు బయలుదేరిన సిపిఐ నాయకులు

ప్రజా గర్జన సభకు బయలుదేరిన సిపిఐ నాయకులు

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి :

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున సిపిఐ పార్టీ ప్రజా గర్జన బహిరంగ సభకు మిర్యాలగూడ నుంచి సిపిఐ పార్టీ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..

 

దేశంలోని రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ రంగ పరిశ్రమలు రాజ్యాంగ లౌకిక వ్యవస్థ పరిరక్షణకై కొత్తగూడెంలో ప్రకాశం స్టేడియంలో జరుగు బహిరంగ సభ నిర్ణయం తీసుకుని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయుటకు నిర్ణయించడం జరిగింది అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆర్థిక స్థితిగతుల మీద దేశాన్ని నడిపించకుండా మతాల పేరుట దేవుళ్ళ పేరుట ఈ దేశాన్ని నడిపించాలని ఒక కొటెల ప్రయత్నంతో కొనసాగుతున్నారు అని అన్నారు.

 

ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

 

ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు ఎల్ఐసి రైల్వే టెలికం విమాన సంస్థలు నౌకాశ్రయాలు ఆయిల్ కంపెనీలు రక్షణ పరిశోధన రంగాలు ప్రైవేటీకరణ చేయకూడదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలి కోరారు.

 

కార్మికులు వారు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను యధావిధిగా ఉంచాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు పరచాలి యువకులకు నిరుద్యోగ భృతి కింద 3016లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల వాటా తేల్చాలి.

 

ALSO READ : అధికారిక లాంచనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు, అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, రాష్ట్రంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మీద భవిష్యత్తులో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తావని వారు అన్నారు.

 

బహిరంగ సభకు పోయిన నాయకులు వేమనపల్లి మండల కార్యదర్శి జిల్లా యాదగిరి, మిర్యాలగూడ మండల సహాయ కార్యదర్శి గువ్వల అంజయ్య, గోగుల యాదగిరి. వలపట్ల వెంకన్న. గువ్వలవెంకటయ్య, ఎస్ కే షమీం, లింగంపల్లి సైదమ్మ, బంటు రేణుక, చింతమల రాములు, బంటు దేవి వరప్రసాద్, గూగుల్ యశ్వంత్, లింగం తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ : Gruhalaxmi : సొంత స్థలం ఉంటే తెలంగాణ గృహలక్ష్మి పథకం.. రూ. 3 లక్షలు ఇలా పొందండి..!