క్రీస్తు ప్రత్యక్షత పరిచర్యలు చర్చిలో నోముల ప్రకాష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు

క్రీస్తు ప్రత్యక్షత పరిచర్యలు చర్చిలో నోముల ప్రకాష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మనసాక్షి :

142 డివిజన్ లోని క్రీస్తు ప్రత్యక్షత పరిచర్యలు చర్చిలో పాస్టర్స్ ఫెలోషిప్ లో భాగంగా పాస్టర్ల ప్రార్థన మీటింగులలో మణిపూర్ లో జరుగుతున్న గొడవల అలాంటివి మరెక్కడ జరగకూడదని దేశము, రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని మంగళవారం ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నోముల ప్రకాష్ రావు గౌడ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చర్చిలోకి అడుగు పెట్టగానే ఒక ప్రత్యేకమైన అనుభూతికి లోనయ్యానని ఇక్కడికి ఎవరు వచ్చినా ఏ ఉద్దేశంతో వచ్చిన మంచి ఆలోచన మంచి ఆలోచనలు కలిగే విధంగా ఉందని ఆ ప్రభువు తనతో పాటుగా అందరికి ఆశీస్సులు ఇవ్వాలని అయన కోరుకున్నరు.

 

ALSO READ : 

Telangana : తెలంగాణలో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు..!

Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?

Cheater : చీటర్ మూవీ ఫస్ట్ లుక్..! 

 

డిసిసి ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్, ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. అనంతరం పాస్టర్లు యోన, జెకబ్ లు నోముల ప్రకాష్ కి ఎమ్మెల్యే టికెట్ రావాలని, ఆయన భారీ మెజార్టీతో గెలుపొంది, ఎమ్మెల్యే కావాలని ఆయనకు ఆ ప్రభువుని ప్రార్థిస్తూ ఆశీర్వచనాలు అందించారు.

ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు ప్రెసిడెంట్ పాస్టర్ జేకబ్, రాజేంద్రప్రసాద్, అరుణ్ కుమార్, భూషణ్, యోన, నిరీక్షణ, శేఖర్, కాంగ్రెస్ నాయకులు జగ్గు, సురేష్ లాల్, ఎమ్మార్ శ్రీనివాస్, వేణు గౌడ్, టెంట్ హౌస్ వేణు, లక్ష్మణ్, శివ, వహీద్ భాయ్, బబ్లు, పాల్, ప్రశాంత్, ప్రకాష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.