Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

విద్యుత్ ఉద్యోగుల పిఆర్సి పై 6న సమావేశం

విద్యుత్ ఉద్యోగుల పిఆర్సి పై 6న సమావేశం

మిర్యాలగూడ, మనసాక్షి

విద్యుత్ ఉద్యోగుల పి.ఆర్.సి పై
మార్చి 6వ తేదీన నూతన వేతన సవరణ కమిటీ చర్చలకు ఆహ్వానించింది. కాగా జేఏసీ నాయకులు విద్యుత్ బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్, 1104 యూనియన్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి యల్ వెంకటయ్య మాట్లాడుతూ..

 

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ లోని అన్ని విభాగాల ఉద్యోగులకు , పింఛన్దారులకు పిఆర్సి పై చర్చించెందుకు ఈనెల 6న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ విద్యుత్ సౌదాలో I సమావేశం నిర్వహించే చర్చించనున్నట్లు తెలిపారు.

కానీ 04/ 2022 నుండి రావాల్సిన నూతన వేతనాలు , ఉద్యోగ సమస్యలు పరిష్కరించాల్సిన మేనేజ్మెంట్ ఇప్పటిదాకా కాలయాపరా చేస్తూ వస్తున్నందున, రాష్ట్ర పిఆర్సి జేఏసీ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్కు ఎన్నో రకాలు గా దరఖాస్తులు ఇవ్వటం జరిగినది అన్నారు.

 

 

ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగినాయి కానీ మేనేజ్మెంట్ ముందుకు రాలేదు కాబట్టే నల్ల బ్యాడ్జీలతో భోజన టైం లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని, ఈ మధ్యకాలంలో రాష్ట్ర పిఆర్సి జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ని కలవడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారని తెలిపారు . అదే విధంగా మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడతానని చెప్పడం జరిగినదని, ఇప్పుడు వెంటనే మేనేజ్మెంట్ నూతన వేతనం గురించి ఈనెల 6 న పరిష్కర చేస్తామని మళ్లీ చర్చల కోసం పిలవటం జరిగినదని అన్నారు .

 

6న జరిగే నూతన వేతన సవరణ సమావేశం సానుకూలంగా జరగాలని ఉద్యోగస్తులు వ్యక్తం చేస్తున్నారని, లేనిపక్షంలో ఉద్యమం అద్భుతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో పిఆర్సి నాయకులు శ్రీనివాస్ రెడ్డి, హరికిషన్, శ్రీనివాస్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు