BREAKING : నల్గొండ జిల్లాలో సూడో నక్సలైట్ల మూఠా అరెస్ట్..!

నల్గొండ జిల్లాలో సూడో నక్సలైట్లు ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు

BREAKING : నల్గొండ జిల్లాలో సూడో నక్సలైట్ల మూఠా అరెస్ట్..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లాలో సూడో నక్సలైట్లు ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు .ఆదివారం ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తోటకూరి శేఖర్ గణపురం పీఏ పల్లి మండలం. నల్లగొండ జిల్లా. మాచర్ల శ్రీనివాస,మదిపల్లి తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా. గుంటుక రమేష్ మదిపల్లి తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా.మరేపాక లక్ష్మీనా రాయన కేసముద్రం మహబూబాద్ జిల్లా అనే నేరస్తులను అరెస్టు చేసినట్లు తెలిపారువ

నేరస్తులు ఎలా పట్టుబడారు :

గత నెల 28వ తేదీన ఘణపురం గ్రామా శివారులో గల పెద్దమ్మ తల్లి గుడి శుబ్రం చేయాయడానికి వెళ్ళిన తోటకురి పెద్ద వెంకటయ్య కు గుడిలో ఒక వైపు మూలకు 3 తుపాకులు కనిపించగా అతను అట్టి సమాచారం పోలీసు వారికి ఇవ్వగా పోలీసు వారు అట్టి 3 తుపాకులను పంచనామా నిర్వహించి స్వాదినం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ చందన దీప్తి తెలిపారు.

కేసు దర్యాప్తు లో భాగంగా, విచారణ చేస్తున్న క్రమం లో కొందరు సాక్ష్యాలను బట్టి ఘణపురం గ్రామానికి చెందినటువంటి తోటకూరి శేఖర్ ఇట్టి తుపాకులను దాచాడు అనే అనుమానం తో అతని గురించి గాలిస్తుండగా అతనిని ఆదివారం అంగడిపేట లో పట్టిబడిచేసి విచారించగా, ఇతను గతంలో అక్రమంగా తుపాకులు కలిగి ఉండి హాలియా పోలీసు స్టేషన్ కేసులో జైలుకు వెళ్ళడం జరిగిందని తెలిపారు.

ఇతనికి మిర్యాలగూడ జైలులో రమేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఎలాగైనా తొందరగా జీవితంలో స్థిరపడాలని ఉద్దేశంతో రమేశ్ కి తెలిసిన మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి లక్ష్మీనారాయణ, శ్రీనివాసలు కలిసి సూడో నక్సలైట్లుగా మారి, తుపాకులను ధరించి ధనవంతులను, మైనింగ్ వ్యాపారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను అదేవిదంగా రోడ్డు పై వెళ్ళే వాహనాలు ఆపి తుపాకులు చూయించి బాయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేసేవారిని తెలిపారు.

ఆర్థికంగా తొందరగా స్థిరపడాలని ఉద్దేశంతో వాళ్ల పథకం అమలుపరచుటకు తుపాకులను, జీకే వీధి సాపర్ల,విశాఖపట్నం దగ్గరలో కొనుగోలు చేసినారని అట్టి తుపాకులను కొన్ని రోజులు శేకర్ తన ఇంట్లో ఉంచుకొని యెవరైయన చూస్తారని బయపడి ఘణపురం గ్రామం చివర జనసంచారం లేని పెద్దమ్మ తల్లి గుడిలో భద్రపరిచినాడు అని చెప్పారు.

ఇట్టి తుపాకులు పెద్దవిగా ఉన్నాయని బావించి వాటితో పాటు పిస్టల్ లాంటి చిన్న తుపాకులను ఉంటే సులువుగా కనపడకుండా పట్టుకెళ్ళ వచ్చునని, అట్టి పిస్తల్ కొనుగోలు కోసం అన్వేషిస్తూన్న క్రమంలో ఈ రోజు అంగడిపేట లో శేకర్ పట్టుబడినాడని ఇతను ఇచ్చిన సమాచారంతో మిగతవారిని హైదరాబాదులో పట్టుకోని వీరి పై cr .no 77/2024 U/S Sec 25 ARMS act ప్రకారం కేసు నమోదు చేసి రిమాండుకి తరలించినట్లు తెలిపారు.

ఏవరైనా ఇలాంటి అక్రమ ఆయుదాలు కలిగి ఉండడం నేరం. కావున యెవరైనా ఎలాంటి బెదిరిపులకు పాల్పడిన మరియు ఇతరులను బెదిరించే విదంగా ఆయుదాలు కలిగి ఉన్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని ఎస్పీ హెచ్చరించారు. ఇట్టి కేసును చేదిoచుటకు దేవరకొండ డి.యస్.పి  అద్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక బృందం అయినా కొండమల్లేపల్లి సిఐకేధనుంజయ్, గుడిపల్లి యస్.ఐ డి.నర్సింహులు, సిబ్బంది, హేమూ నాయక్, సత్యనారాయణ, హట్టి నాయక్, కొండల్, భాస్కర్, మహేశ్, మరియు గురువ రెడ్డి, లాలూ నాయక్ లనుప్రతెకముగా నల్గొండ ఎస్పీ అభినందించారు.

ALSO READ : 

BREAKING : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కోయ శ్రీ హర్ష..!

గడ్డిమందు తాగితే రూ.లక్ష పందెం.. ఒప్పుకుని మందు సేవించిన వ్యక్తి..!

BREAKING : తెలంగాణలో మహిళ శక్తి క్యాంటీన్లు.. నిర్వహణ మహిళా సంఘాలకే..!