సూర్యాపేట : దశాబ్ద ఉత్సవాల పేరుతో ప్రజాధనం వృధా

సూర్యాపేట : దశాబ్ద ఉత్సవాల పేరుతో ప్రజాధనం వృధా

టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి

దశాబ్ది ఉత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనం వృధా చేస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 9 సంవత్సరాల పాలనలో 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విప్లమైందని తెలిపారు.

 

తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారని, ఉద్యోగాలు కల్పిస్తానని అధికారంలోకి వచ్చి మాట మార్చారని అన్నారు. పేదలకు ఇండ్లు కట్టించడంలో పూర్తిగా విఫలమైందని కేవలం 4వేల ఇండ్లు మాత్రమే కట్టించారని, సూర్యాపేట మున్సిపాలిటీలో 6 వేల కోట్ల అభివృద్ధి అంటూ సుందరీకరణ అంటూ అవసరం లేని పనుల మీద డబ్బులు ఖర్చు పెడుతూ, మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విప్లమయ్యారని అన్నారు.

 

Also Read : Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

 

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ9 సంవత్సరాల నుంచి చేయలేదన్నారు. ధాన్యం కొనే పరిస్థితి లేదని, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, ట్యాంక్ బండ్, ఇంటిగ్రేట్ మార్కెట్, పూర్తి చేయకపోగా దళిత బంధు కొంతమందికే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయాన్ని అవినీతి తో విచ్చలవిడిగా దోచుకుంటున్నారని తెలిపారు. కాంట్రాక్టు ఒకే వ్యక్తికి ఇచ్చి 30% కమిషన్ ను స్థానిక మంత్రి అనుచరుల ద్వారా దోచుకుంటున్నారని వాపోయారు.

 

తెలంగాణలో యువతను పెడదారి పట్టి 40 వేల కోట్లు రూపాయలు మద్యం ద్వారా ఆదాయం ప్రభుత్వానికి చేకూరుతుందని తాగుబోతుల తెలంగాణ మార్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు.

 

హరితహారం పేరుతో మొక్కలకు మున్సిపాలిటీ ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారని, సుందరీకరణ పేరుతో ఫ్లయి ఓవర్ మీద ఉన్న బొమ్మలకు 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఇందులో కాంట్రాక్టర్లకు ముట్టింది ఎంత అని అన్నారు.

 

Also Read : Virupaksha Memes : విరూపాక్ష మీమ్స్… నాన్ స్టాప్ కామెడీ.. నెట్టింట్లో వైరల్ (వీడియోస్)

 

మున్సిపాలిటీలో విలీన గ్రామాలకు సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మంత్రి లక్ష హారతి పేరు మీద కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, దామోదర్ రెడ్డి హాయంలో ఎస్సారెస్పీ కాలువల తవ్వించి తద్వారా నీరు తెస్తే నేడు మంత్రి కాలేశ్వరం జలాలను మేమే తెచ్చినామని  గొప్పలు చెప్పుకుంటున్నారని, అవి ఎస్సారెస్పీ నీళ్లు అని ప్రజలందరికీ తెలుసని అన్నారు. జిల్లాలో గంజాయి, లిక్కర్, సాండ్ మాఫియా ఏదేచ్ఛగా కొనసాగుతుంటే ఏమీ తెలియదు అన్నట్టు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Also Read : Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!

 

కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా బిజెపి పార్టీని ఓడించిందో తెలంగాణలో కూడా అదే రిపీట్ అవుతుందని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తత్సర్యం చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

అనంతరం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మిట్ట కోల సతీష్ కు పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షఫీ ఉల్లా, గట్టు శ్రీను, గోదాల రంగారెడ్డి, నాగేశ్వరరావు, బెల్లంకొండ శ్రీరాములు, వల్దాసు ఉపేందర్, స్వామి నాయుడు, భాస్కర్ నాయక్, ధర్మ తదితరులు పాల్గొన్నారు.