Ts : క్షుద్ర పూజల కలకలం

Ts : క్షుద్ర పూజల కలకలం

జగిత్యాల , మనసాక్షి :

జగిత్యాల జిల్లా లో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. జగిత్యాల పట్టణంలోని మోతే స్మశాన వాటికలో గుర్తుతెలియని వ్యక్తి బుధవారం అర్ధరాత్రి నగ్నంగా పూజలు చేసినట్లు ప్రచారం సాగుతుంది. శవాలను కాల్చిన బూడిదను ఒళ్లంతా పోసుకొని పూజలు చేసినట్లు ప్రచారం కొనసాగుతుంది. అది గమనించిన కొంతమంది స్థానికులు కర్రలతో ఆ వ్యక్తిని వెంబడించగా అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది.

 

దాంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో కూడా కుంకుమ, పసుపు నిమ్మకాయలు పెట్టి కోడిని కోసి క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి . 15 రోజుల వ్యవధిలోనే ఇలాంటి సంఘటనలు పట్టణంలో చోటు చేసుకోవడంతో పట్టణ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.