Rahul : రాహుల్ గాంధీకి పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధరణ.. నోటిఫికేషన్ జారీ..!
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ కి పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకు ముందే లోక్ సభ సెక్రటేరియట్ నోటీసు జారీ చేసింది.

Rahul : రాహుల్ గాంధీకి పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధరణ.. నోటిఫికేషన్ జారీ..!
న్యూఢిల్లీ , మనసాక్షి :
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ కి పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకు ముందే లోక్ సభ సెక్రటేరియట్ నోటీసు జారీ చేసింది.
మోడీ ఇంటిపేరు కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించిన విషయం తెలిసిందే. కాగా రాహుల్ గాంధీ ఈ కేసు విషయంపై సుప్రీంకోర్టులో కు వెళ్లగా ఈ నెల నాలుగో తేదీన సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించింది.
గత ఐదు మాసాలుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. మోడీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో చివరికి సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట కలిగింది .
అసలు కథ :
2019 ఎన్నికల సందర్భంగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే పూర్నేష్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మోడీకి సూరత్ కేసు కోర్టు రెండు సంవత్సరాల శిక్ష విధించింది. మోడీ ఇంటి పేరు ఉన్న అందరినీ రాహుల్ గాంధీ అవమానించారని పూర్ణేష్ మోడీ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు.
సుప్రీం కోర్టులో ఊరట :
ఈ కేసు పై సుప్రీంకోర్టు విచారించింది. సూరత్ కోర్టు 2023 మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఇచ్చిన విషయం తెలిసిందే. ఆప్పీ ల్ చేసుకోవడానికి నెలరోజుల పాటు శిక్ష నిలిపివేసింది. ఈ విషయంపై నాలుగు నెలలుగా రాహుల్ గాంధీ వివిధ కోర్టులను ఆశ్రయించారు. కాగా సుప్రీం కోర్టుకు వెళ్లగా ఊరట కలిగింది. శిక్ష పట్ల సుప్రీంకోర్టు స్టే విధించింది వ దాంతో పార్లమెంటు సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించారు.
ALSO READ :
- WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!
- WhatsApp : వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్ మరొకటి..!
- Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!
- Telangana : తెలంగాణలో రైతు బీమా తరహాలోనే.. మరొకటి..!