గాలి వాన బీభత్సం

గాలి వాన బీభత్సం

దమ్మపేట,మన సాక్షి :

ములుగు జిల్లా దమ్మపేట మండలంలో ఈరోజు సాయంత్రం కురిసినటువంటి వర్షం గాలి బీభత్సం అన్ని వర్గాల వారికి కన్నీటిని మిగిల్చింది. మండలంలో ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్లే జాతీయ రహదారి వెంట భారీ వృక్షాలు వరిగి ఐదు కిలోమీటర్ల మేర ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి.

మండల కేంద్రంలో బంజారా కాలనీలో ఒక ఇంటి మీద భారీ వృక్షం ఒరిగింది అదృష్టవశాస్తూ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికి ప్రాణహాని జరగలేదు. మరియు మండలంలో ప్రధానంగా ఉద్యానవన మామిడి నర్సరీలు పూర్తిగా దెబ్బతిని లక్షల్లో నష్టాన్ని మిగిల్చిందని యజమానులు కన్నీరు మున్నీరయ్యారు.

 

మామిడి చెట్లు మరియు కరెంటు స్తంభాలు మండలంలో అనేక చోట్ల నేలకొరిగాయి దీనివల్ల మండలంలో విద్యుత్ అంతరాయం కలిగింది. ఇది ఇలా ఉండగా మందలపల్లి కేంద్రానికి కొద్దిపాటి దూరంలో ఎన్నో వందల సంవత్సరాల నాటి మహా వృక్షం నేలకొరిగింది ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది .

ఈ విషయం తెలుసుకున్న మండల ప్రజలు ఆ ప్రదేశానికి వచ్చి వీక్షించారు. మండలంలో అనేక చోట్ల మొక్కజొన్నలు మరియు వడ్లు కళ్ళల ఆరపోయటం వలన అనుకోకుండా వచ్చిన గాలి వర్ష బీభత్సానికి పూర్తిగా తడిసిపోయి రైతు కంట కన్నీటిని మిగిల్చింది