రెబల్ స్టార్ కన్నుమూత – latest news

రెబల్ స్టార్ కన్నుమూత

హైదరాబాద్, మనసాక్షి : రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలి లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో  మృతి చెందారు. 1940 జనవరి 20 లో జన్మించిన ఆయన కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.  ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. 1966 లో చిలుకా గోరింక సినిమాతో కృష్ణంరాజు వెండితెరకు పరిచయమయ్యారు . 187 సినిమాల్లో నటించిన కృష్ణంరాజు. చివరిసారిగా రాదేశ్యామ్ సినిమాలో నటించారు. వాజ్ పేయ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు.

ఫిలింఫేర్ అవార్డు తో పాటు నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు ఆయన సొంతం చేసుకున్నారు. సినీ రంగంలో ఆయన రెబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఆయన ప్రవేశించి కేంద్ర మంత్రిగా పనిచేశారు. కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు హైదరాబాదులో నిర్వహించనున్నారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు సంతాపం తెలియజేశారు.

ఇవి కూడా చదవండి : 

1. బాలాపూర్ లడ్డుకు రెట్టింపు ధర పలికిన అల్వాల్ గణపతి లడ్డు

2. రేవంత్ రెడ్డిని కలిసిన స్రవంతి, కృష్ణారెడ్డి

3. మిర్యాలగూడ : వ్యక్తి ఆత్మహత్య – latest news