రెడ్డిగూడెంలో వీధి కుక్కల దాడి
రెడ్డిగూడెంలో వీధి కుక్కల దాడి
పినపాక, మన సాక్షి :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల వ్యాప్తంగా వీధి కుక్కలు స్వైరవీహారం చేస్తున్నాయి. నిత్యం ఏదో ఓ చోట కుక్కల దాడిలో ప్రజలు గాయపడుతూనే ఉన్నారు. బుధవారం దుగినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల రెడ్డిగూడెం గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి పలువురిని గాయపరిచాయి.
రెడ్డిగూడెం గ్రామంలో రాపర్తి అయోధ్య, అండెం విజయ్ కుమార్ అనే రైతులకు చెందిన
గేదె దూడలను కరవడమే కాక అక్కడే విద్యుత్ మరమ్మతులు చేస్తున్న భాస్కర్ అనే యువకుడిని కూడా పిచ్చికుక్క గాయపరిచింది.
వెంటనే ఆగ్రహించిన గ్రామస్తులు , యువత పిచ్చికుక్కని వెంబడించి హతమార్చారు. పిచ్చికుక్క కరిచిన భాస్కర్ అనే యువకుడిని వైద్యం కోసం జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పిచ్చికుక్క కాటు వేసిందని మెరుగైన వైద్యం కోసం మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళవలసిందిగా సూచించారు.
బాధితుడి కుటుంబ సభ్యులు మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చికిత్స అందించారు. గతంలో ఇదే గ్రామంలో పలు గేదెలను కుక్కలు గాయపరిచిన విషయం తెలిసిందే.వీధి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.










