Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda | రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – ‌‌శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ 

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా –

‌‌శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ 
నల్గొండ , మన సాక్షి:

రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని, ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కూడా మీ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారని అతి త్వరలోనే మీకు మంచి రోజులు వస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. గురువారం రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్వంలో నల్లగొండలోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు.

 

ఈ సందర్భంగా స్పందించిన ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్య అతి త్వరలోనే పరిష్కారమవుతాయని, సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆలోచించి సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ది చేయడంలో చిత్తశుద్దితో ఉన్నారన్నారు. రేషన్ డీలర్ల సమస్యలను కూడా తన వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

 

నల్గొండ జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షుడు పారపల్లి నాగరాజు మాట్లాడుతూ రేషన్ డీలర్లు చాలీచాలని కమిషన్లతో గత 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాల పోషణ ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటినుండి ఇప్పటివరకు కూడా పలుమార్లు ప్రభుత్వ యంత్రాంగాన్ని , రాష్ట్ర మంత్రుల, ప్రజా ప్రతినిధులను కలసి అనేకసార్లు మా సమస్యల పరిష్కరించాలని కోరామన్నారు.

 

రేషన్ డీలర్లకు వేతనం ఇవ్వాలని, 5 గురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ నివేదికను బహిర్గతం చేసి దానికనుగుణంగా సమస్యను పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలోని సుమారు 168 గోదాం పాయింట్లలో వేబిడ్జిల ఏర్పాటు చేయాలని, ప్రతి రేషన్ డీలర్ కు పదిలక్షల ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఏనుగుమల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, కోశాధికారి కోటగిరి సూర్యనారాయణ, నల్గొండ నియోజకవర్గ రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు