TG News : గోర్ బోలి(లంబాడా) భాషకు గౌరవం.. సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు..!
TG News : గోర్ బోలి(లంబాడా) భాషకు గౌరవం.. సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు..!
చింతపల్లి, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చర్చల సందర్భంగా గోర్ బోలి ( లంబాడా ) భాషకు తెలంగాణ అసెంబ్లీ చారిత్రక నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.
జరుగుతున్న అసెంబ్లీ కార్యక్రమాలు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోర్ బోలి ( లంబాడా ) భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చేందుకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ని గురువారం అసెంబ్లీలో కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు. భాష పరిరక్షణలో మరో కీలక ముందడుగు వేయడం.
ఈ నిర్ణయం లంబాడా భాషాబిమానులకు ఎంతో గర్వకారణం అని వారు పేర్కొన్నారు. ఈ చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ భాషా హక్కుల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ముందడుగు ఎంతో ప్రశంసనీయమని పారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
MOST READ :
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!
-
District collector : ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే డౌన్.. డిజిటల్ చెల్లింపుల్లో అంతరాయం..!
-
Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!
-
Property Tax : ఆస్తి పన్ను పై అదిరిపోయే ఆఫర్.. 90% మాఫీ..!









