Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Revanth Reddy : కెసిఆర్ కు రేవంత్ సవాల్.. మే 9న తెలంగాణ స్థూపం వద్ద చర్చకు సిద్ధమా..?

Revanth Reddy : కెసిఆర్ కు రేవంత్ సవాల్.. మే 9న తెలంగాణ స్థూపం వద్ద చర్చకు సిద్ధమా..?

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ చేశారు. రైతుబంధు విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఈనెల 9వ తేదీ లోగా ప్రతి ఒక్కరి ఖాతాలలో రైతుబంధు డబ్బు పడుతుందని.. ఒకవేళ రైతుబంధు రాకుంటే 9వ తేదీన హైదరాబాదులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఏ ఒక్క రైతు కూడా రైతుబంధు రాలేదంటే.. తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడా అంటూ సవాల్ చేశారు.

అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ వరకు రైతుల రుణమాఫీ చేసి హరీష్ రావుకు బుద్ధి చెప్తామన్నారు. కేంద్రంలో సంకీర్ణం వస్తుందని చెబుతున్న కేసీఆర్ ఆయన ఏ కూటమిలో చేరుతారని అడిగారు. కాంగ్రెస్ పార్టీ కూటమిలోకి కేసీఆర్ తీసుకోబోమని ,ఆయన చేరేది బిజెపిలోనే అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. మే 13వ తేదీ ఫైనల్స్ లో బిజెపిని ఓడించాలని ఆయన కోరారు. పదేళ్లపాటు కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కెసిఆర్ దోచుకున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ALSO READ : 

Theenmar Mallanna : నామినేషన్ రోజే తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన.. రాజకీయాల్లో ప్రకంపనలు..!

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!

BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

మరిన్ని వార్తలు