మహేశ్వరం : కంకర పోశారు.. రోడ్డు మరిచారు..!

మహేశ్వరం : కంకర పోశారు.. రోడ్డు మరిచారు..!

మహేశ్వరం,(మన సాక్షి) :

మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ పరిధి రావిరాల గ్రామం గాంధీ బొమ్మ చౌరస్తా నుండి ఆర్ సి ఐ రోడ్ వరకు రోడ్డు పనులు ప్రారంభించారు.

 

Also Read : Aadhaar Card : ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త..!

 

చాలా రోజులు గడుస్తున్న కంకర పోసి రోడ్డు వేయడం మర్చిపోయారేమో… కంకర రోడ్డుపై నిత్యం ప్రయాణించాలంటే వాహనదారులు నరకయాతన పడుతున్నారు.

 

కంకర రోడ్డుపై వాహనదారులు ప్రయాణించలేక అనేక ప్రమాదాలు జరుగుతున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంకర రోడ్డుపై దుమ్ము దూళికి రావడంతో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు.

 

Also Read : Central scheme : కేంద్ర ప్రభుత్వ పథకం.. నెలకు రూ. 10 వేలు ఎవరైనా పొందొచ్చు

 

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని తక్షణమే రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కంకర పోసి రోడ్డు వేయడం ఎందుకు మర్చిపోయారు అర్థం కావడం లేదని రోడ్డు వేయనప్పుడు ఎందుకు కంకర పోసి వదిలేశారని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

గ్రామ ప్రజలు వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే రోడ్డు వేయాలని కోరుతున్నారు.లేని పక్షంలో గ్రామం నుండి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు ఆందోళన చేపడతామని వాహనదారులు హెచ్చరిస్తున్నారు.

 

రోడ్డు పనులు చేపట్టకపోతే వెంటనే కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు..