పోలీసులమని చెప్పి విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి పై దారి దోపిడీ…!

పోలీసులమే చెప్పి తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులని బైకులు ఆపి ఉంగరాలను లాక్కున్న ఘటన దుబ్బాక నియోజకవర్గం లోని చేగుంట మండల కేంద్రంలోని బైపాస్ బ్రిడ్జి వద్ద సోమవారం చోటు చేసుకుంది.

పోలీసులమని చెప్పి విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి పై దారి దోపిడీ…!

చేతికి ఉన్న 1.50 లక్షల ఉంగరాలు లాక్కున్నారు

 బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

దుబ్బాక, మనసాక్షి :

పోలీసులమే చెప్పి తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులని బైకులు ఆపి ఉంగరాలను లాక్కున్న ఘటన దుబ్బాక నియోజకవర్గం లోని చేగుంట మండల కేంద్రంలోని బైపాస్ బ్రిడ్జి వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు చేగుంట మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు దొడ్ల రామచంద్రం తెలిపిన వివరాల ప్రకారం..

మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో తన వ్యవసాయ పొలం నుంచి బండి పై వస్తుండగా బైపాస్ బ్రిడ్జి వద్ద బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు బండిని ఆపి తాము పోలీసులమని చెప్పారు. పనికి మరో బండి పై మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి వెనక నుండి గట్టిగా పట్టుకుని కత్తి చూపించి తన చేతికి ఉన్న రెండు ఉంగరాలను లాక్కెళ్లాడు.

ALSO READ : BIG BREAKING : నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్.. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల..!

అంతేకాకుండా మెడలో బంగారు గొలుసు ఉందేమోనని గొంతును గట్టిగా పట్టుకున్నారు. జిల్లాలో అదనపు బస్సులు నడపాలి రెండున్నర తులాల రెండు ఉంగరాలు సుమారు లక్ష రూ. 50 వేల విలువగల ఉంగరాలను లాక్కెళ్ళి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాధితుడు చేగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు చేగుంట పోలీసులు దారి దోపిడికి పాల్పడిన నిందితుల గురించి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

తూప్రాన్ డీఎస్పీ, రామాయంపేట సీఐతో పాటు పోలీసులు, అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకొని దోపిడీ ఘటనను సమీక్షించారు. శుక్రవారం రోజు ఇంటి ముందు ఆపి ఉన్న కారు నుంచి రూ. 5 లక్షల రూపాయల దోపిడీ ఘటన మరువక ముందే పోలీసుల పేరు చెప్పి బంగారు ఆభరణాల దారి దోపిడీ ఘటన నమోదు అయినా విషయం తెలిసిందే.

ALSO READ : Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… 26న నల్గొండలో భారీ జాబ్ మేళా..!