Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి : చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, 18 మందికి గాయాలు
యాదాద్రి భువనగిరి : చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, 18 మందికి గాయాలు
వలిగొండ మార్చి 21 మన సాక్షి:
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ (మం) టేకుల సోమారం (పడమటి వారి గూడెం) వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో 18 మందికి గాయాలయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ..నల్గొండ నుండి భువనగిరికి వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు టేకుల సోమవారం వద్ద చెట్టును ఢీకొట్టింది బస్సులో ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించబోయి ఈ ప్రమాదం సంభవించింది. బస్సులోని 18 మందికి గాయాలు కాగా, డ్రైవర్ కు రెండు కాళ్లు విరిగినవి. గాయాలైన వాళ్ళని అంబులెన్స్ లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.
.









