Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
చింతపల్లి, మన సాక్షి
మండల పరిధిలోని ముదిగొండ వాగు నుండి అక్రమంగా నసర్లపల్లి గ్రామానికి తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లు ల ను పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాగు నుండి తరలిస్తుండగా గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ట్రాక్టర్లను సీజ్ చేశారు.
నూతనంగా గృహ నిర్మాణాల కోసం మీసేవ ద్వారా అనుమతి పొందిన తర్వాతనే ఇసుకను తరలించాల్సి ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండు కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.









