మిర్యాలగూడ : ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి.. హాజరైన జానారెడ్డి..!
మిర్యాలగూడ : ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి.. హాజరైన జానారెడ్డి..!
మిర్యాలగూడ , మన సాక్షి :
బహుజన కులాల, పీడిత వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతిని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ కరెంటు ఆఫీస్ ఎదురుగా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సీఎల్పీ నేత కుందూరు జానా రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దానికోసం ఒక్కడిగా మొదలై వేలాదిమంది బహుజన కులాల నాయకులను ఐక్యం చేసి అనేక కోటలను బద్దలు కొట్టి గోల్కొండ కోటపై జెండాను పాతి బహుజన కులాల గౌరవాన్ని నిలిపిన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగ యాదవ్,నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంప్ చైర్మన్ పోలగా నీ వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్,
తమ్మడ బోయిన అర్జున్, తలకొప్పుల సైదులు, మిర్యాలగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకునూరి బసవయ్య గౌడ్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పెద్ది శ్రీనివాస్ గౌడ్, యాదగిరి గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చౌగాని వెంకన్న గౌడ్, ఉదయ్ భాస్కర్ గౌడ్, కాకునూరి విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
Suryapet : సూర్యాపేట జిల్లా లో తీవ్ర విషాదం.. దండు మైసమ్మ ఆలయం వద్ద ఆరేళ్ల బాలుడు మృతి..!
Dharani : కాసుల పంట.. ధరణి పెండింగ్ కేసులు..!
Ration Shops : రేషన్ దుకాణాలపై సివిల్ సప్లై అధికారులు ముమ్మర దాడులు..!









