సీతారామ ప్రాజెక్టు ద్వారా 1.5 లక్షల ఎకరాలకు నీరు..!

సీతారామ ప్రాజెక్టు ద్వారా 1.5 లక్షల ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న సీతారామ లిఫ్ట్ పంప్ హౌస్ వద్ద బుధవారం నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

సీతారామ ప్రాజెక్టు ద్వారా 1.5 లక్షల ఎకరాలకు నీరు..!

దమ్మపేట రూరల్, మన సాక్షి :

సీతారామ ప్రాజెక్టు ద్వారా 1.5 లక్షల ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న సీతారామ లిఫ్ట్ పంప్ హౌస్ వద్ద బుధవారం నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఇంకా ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలి అనే దానిపై మంత్రికి మ్యాప్లో చూపెడుతూ వివరించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వర్షాకాలంలోపు గ్రౌండ్ కాంక్రీట్ వర్క్ పనులు మొత్తం పూర్తి అవ్వాలని ఆదేశించారు.

ALSO READ : BREAKING : గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..!

ఇప్పటివరకు ప్రాజెక్టు పనులకు రూ.7వేల కోట్లు ఖర్చుపెట్టి 7 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోతే ప్రాజెక్టుపై రైతులలో ఆశలు సన్నగిల్లుతాయని, సకాలంలో పనులు పూర్తి చేయాలని అన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇప్పటికే మూడు పంప్ హౌస్ పనులు పూర్తయ్యాయని, మరొక పంప్ హౌస్ నిర్మాణంలో ఉందని, టన్నెల్స్ వలన పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు.

ALSO READ : Free Bus : ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలకు.. షాకింగ్ న్యూస్..!

ప్రాజెక్టుకు సంబంధించి రహదారులు, రైల్వే బ్రిడ్జిలు, ఫారెస్ట్ సంబంధించిన అడ్డంకులు వస్తే వెంటనే అధికారులు అందుకు సంబంధించిన భూ సేకరణ చేసి, కలెక్టర్ల తో మాట్లాడి పనులు పూర్తి చేయాలని కోరారు. వచ్చే సంవత్సరం వరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోతే ప్రాజెక్టుకు కేటాయించిన
నిధులు వృథా అయినట్లే అని అన్నారు.

అధునాతన పరికరాలు వినియోగించుకొని పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ముందుగా యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తి చేయాలని తద్వారా సత్తుపల్లి ట్రంకుకు నీరు చేరుకోవడం ద్వారా, టన్నెల్స్ తో పని లేకుండా ఈ సంవత్సరమే వైరా రిజర్వాయర్ కు కూడా గోదావరి నీళ్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

ALSO READ : రేషన్ కార్డు లేకున్నా ప్రజా పాలన దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎమ్మెల్యే బత్తుల వెల్లడి..!

ఇంకా భూసేకరణ చేయడానికి కావాల్సిన నిధులను నీటిపారుదల, ఆర్థిక శాఖ మంత్రులతో మాట్లాడడం జరిగిందని, వాటికి సంబంధించిన నిధులు కూడా కేటాయించి ఈ ఏడాది 1.5 లక్షల ఎకరాలకు నీరు, వచ్చే ఏడాదిలో మరో 1.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడమే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ అనుమతి కావాలన్నా సంబంధిత మంత్రితో మాట్లాడి అనుమతి ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, ఖమ్మం కలెక్టర్ గౌతమ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సీఈ, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ALSO READ : ఉపాధ్యాయుడు లేకపాయే…. పాఠాలు చెప్పరాయే..!