Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

District Sp : జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. నకిలీ విత్తనాలు అమ్మితే పి‌డి యాక్ట్..! 

District Sp : జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. నకిలీ విత్తనాలు అమ్మితే పి‌డి యాక్ట్..! 

సూర్యాపేట, మనసాక్షి :

నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే వ్యవసాయ అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలని , నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దు అని జిల్లా ఎస్పీ కే నరసింహ ఒక ప్రకటనలో కోరారు.

సంభందిత అధికారులు అందరూ సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ వితనాలు సరఫరా జరగకుండా చూడాలని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి వ్యవసాయం ముఖ్యమైన ఆధారం అలాంటి వ్యవసాయం చేసే రైతులు ఆరుగాలం కష్టపడి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై పై ఉన్నది, విత్తన వ్యాపార డీలర్స్ బాధ్యతగా మంచి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని అన్నారు.

రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే అలాంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తాము, పిడి యాక్ట్ తప్పదు, షీట్స్ నమోదు చేస్తాం అని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా ఆంధ్రా ప్రాంతానికి ముఖ్య సరిహద్దుగా ఉన్నదని ఇక్కడ నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉన్నది కావున , ముందస్తు తనిఖీలు చేయాలనీ , రైతులకు, డీలర్ లకు అవగాహన కల్పించడం, సరిహద్దు లలో పటిష్టమైన నిఘా తో నకిలీ విత్తనాలు నివారించాలి అని ఎస్పీ కోరారు .

రైతులతో సమావేశాలు నిర్వహించి చైతన్య పరచాలని గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్నవారి పై నిఘా ఉంచాలని ఆదేశించారు. రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని విజ్ఞప్తి చేశారు.నాణ్యమైన కంపెనీ విత్తనాలు ఎంచుకోవాలని , లేబుళ్లు, ప్యాకింగ్ లేని కొనుగోలు చేయవద్దు అని కోరారు.

తక్కువ ధరకు వస్తున్నాయని గ్రామాల్లోకి వచ్చే మద్యవర్తుల వద్ద విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దని ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్స్ నుండి విత్తనాలు కొనుగోలు చేస్తే మంచిది అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాల లనుండి ఎక్కువ మొత్తంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీసు వారికి, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

MOST READ NEWS :

మరిన్ని వార్తలు