Breaking NewsTOP STORIESరాజకీయం
హామీలు నిలబెట్టుకోలేని సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి – షర్మిల
హామీలు నిలబెట్టుకోలేని
సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాయాలి – షర్మిల
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ , మనసాక్షి: ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి కేసీఅర్
ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు శనివారం సూర్యాపేట నియోజకవర్గం
పెనుపహాడ్ మండలం లో తంగెళ్ళపాడు, చేదెళ్ల, గాజుల మల్కాపురం, అనిరెడ్డి గూడెం వరకు పాదయాత్ర సాగింది. గాజుల మల్కాపురం గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల మాట్లాడారు.
ఆమె మాటల్లోనే….
- ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి మనకు అవసరమా..?
- తెలంగాణ ప్రజలకు మేలు జరిగిందే లేదు
- నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశాడు కేసీఅర్
- నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి ఇంటికి నాలుగు లక్షల మేలు కూడా చేయలేదు
- తెలంగాణ లో ఏ స్కీమ్ కూడా అమలు కావడం లేదు
- ఆరోగ్య శ్రీ నీ చంపేశారు
- ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి 35 వేలు ఇస్తే సరిపోతుందా
- కేసీఅర్ కు బుద్ది చెప్పే సమయం వచ్చింది
- ప్రజలే కేసీఅర్ కు బుద్ది చెప్పాలి
- ఆలోచన చేసి ఓటు వేయండి
- మీ ఓటు తో కేసీఅర్ చెంప చెళ్లుమనాలి
- కేసీఅర్ కు బుద్ది చెప్పిన రోజున తప్పు అయిందని ముక్కు నేలకు రాస్తాడు
- మీ అభిమానం చూస్తుంటే ఆరోజు దగ్గర్లోనే ఉంది
- వైఎస్సార్ సంక్షేమం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ
పాదయాత్రలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి నల్గొండ జిల్లా అధ్యక్షులు మిర్యాలగూడ నియోజకవర్గ ఇంచార్జి ఇంజం నర్సిరెడ్డి , సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిపాల వేణు, నాయకులు పిల్లుట్ల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.











