రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతకే మొదటి ప్రాధాన్యం

రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతకే మొదటి ప్రాధాన్యం

మందమర్రి, అక్టోబర్ 15 మన సాక్షి: సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడు రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ డి రవిప్రసాద్( జిఎం,ఎస్టేట్) పేర్కొన్నారు. సింగరేణి 53వ రక్షణ వారోత్సవాల్లో భాగంగా రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ డి రవిప్రసాద్ (జిఎం,ఎస్టేట్) ఆధ్వర్యంలో రక్షణ తనిఖీ బృందం మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీని శనివారం సందర్శించారు.

ALSO READ : మిర్యాలగూడ: మూడేళ్లయినా… పూర్తికాని బ్రిడ్జి

ఈ సందర్భంగా ఓసిపి ప్రాజెక్ట్ అధికారి రమేష్, ఓసిపి ఉన్నత అధికారులు, ఉద్యోగులు రక్షణ తనిఖీ బృందానికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రెస్క్యూ బృందం నిర్వహించిన ప్రథమ చికిత్స కార్యక్రమం బృందాన్ని, అధికారులను, ఉద్యోగులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచి, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించిన కేకే ఓసిపి ఉద్యోగులకు బహుమతులు ప్రధానం చేశారు. అదేవిధంగా రక్షణ తనిఖీ బృందం సభ్యులు గత సంవత్సరం సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓసీపీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి, రెండో బహుమతి పొందినందుకు కేకే ఓసిపి ఉద్యోగులను, అధికారులను అభినందిస్తూ, ఓసిపి ప్రాజెక్ట్ అధికారి రమేష్ కు జ్ఞాపకను బహుకరించారు. అనంతరం రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ డి రవిప్రసాద్ (జిఎం,ఎస్టేట్) మాట్లాడుతూ..

ALSO READ : ఫ్లాష్..  ఫ్లాష్..  బుచ్చిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం

రక్షణ విషయంలో రాజీ పడవద్దని పేర్కొంటూ, రక్షణ కోసం యాజమాన్యం అందజేసిన పరికరాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ పాటిస్తూ, బొగ్గు ఉత్పత్తికి సహకరించాలని కోరారు. అనంతరం కమ్యూనికేషన్ సెల్ కళాకారులు చేసిన యమ భూలోక యాత్ర అను లఘు నాటిక వీక్షకులను అలరించింది.

ALSO READ : అరచేతిలో అబ్దుల్  కలాం అపు రూప చిత్రాలు

ఈ కార్యక్రమంలో రక్షణ బృందం సభ్యులు డి శ్యాంసుందర్, రామ్మోహన్, బాలాజీ నాయుడు, ప్రసాద్, మందమర్రి ఏరియా రక్షణ అధికారి ఓదెలు, కేకే ఓసీపీ మేనేజర్ మల్లయ్య, టిబిజికెఎస్ గని ఫిట్ కార్యదర్శి యుగంధర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, కేకే ఓసిపి రక్షణ అధికారి కుష్వా, ప్రాజెక్ట్ ఇంజనీర్ సూర్యనారాయణ రాజు, ఓసిపి సంక్షేమ అధికారి సత్యనారాయణ, సింగరేణి అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.