సామాజిక సేవ చేయడం గొప్ప విషయం – ఎమ్మెల్సీ కోటిరెడ్డి

సామాజిక సేవ చేయడం గొప్ప విషయం – ఎమ్మెల్సీ కోటిరెడ్డి

మిర్యాలగూడ, మనసాక్షి : సామాజిక సేవ స్పృహ కలిగి ఉండటం గొప్ప విషయమని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. బృందావన్ గార్డెన్స్ లో జరిగిన మానవత్వం పరిమళించు మహనీయుల కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజంలో కొందరికి మాత్రమే సామాజిక సేవా స్పృహ ఉంటుందని వారిని చూసి ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని కోరారు. తద్వారా మనిషిలో ఆత్మస్థైర్యము ఆనందము, సమాజానికి సేవ చేసిన భావన కలుగుతుందని చెప్పారు.

సన్మాన గ్రహీత నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ సర్జన్ ప్రముఖ కంటి వైద్య నిపుణులు పుల్లారావు మాట్లాడుతూ తన సర్వీసులో లక్ష కంటి ఆపరేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ఒక మిర్యాలగూడ లైన్స్ క్లబ్ పరిధిలో 3500 ఆపరేషన్ చేసినట్లు వివరించారు. తనకు పేదలకుసేవ చేసే అవకాశం కల్పించడం పట్ల లైన్స్ క్లబ్ కు నేను కృతజ్ఞుణ్ణి పేర్కొన్నారు. తనకు శక్తి మేరకు ప్రజలకు ఇంకా సేవ చేస్తానని ప్రకటించారు.

మరో సన్మాన గ్రహీత డాక్టర్ జె. రాజు మిర్యాలగూడ ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నానని పేద ప్రజలు, నిజమైన అర్హులక సేవ చేసే అవకాశం కలగటం తన జీవితంలో గొప్ప అనుభూతిని పేర్కొన్నారు. మిర్యాలగూడలో టీకే రంగాచార్యులు- రంగనాయకమ్మ స్మారక కంటి ఆసుపత్రిలో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. సామాజికంగా వెనకబడ్డ వర్గాలకు సేవ చేయటంలో తాను ముందుంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మిర్యాలగూడ సామాజికవేత్త ముడుంబై రామానుజాచార్యులు మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రజలు, తెలంగాణ ప్రజలు మహోన్నత వ్యక్తులని పేర్కొన్నారు. తాను చేపట్టి సామాజిక కార్యక్రమాలకు చేయూతనివ్వాలని పలువురు లైన్స్ సభ్యులను కోరినప్పుడు వారి దాతృత్వం ప్రకటించి తనకు చేయూత ఇచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు చంద్రయ్య, లైన్స్ సభ్యులు రవీందర్ రెడ్