Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ కాంపిటేషన్ కి ఎంపికైన గురుకుల విద్యార్థులు

నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ కాంపిటేషన్ కి ఎంపికైన గురుకుల విద్యార్థులు

లక్షెట్టిపేట్ , (మన సాక్షి);

సెప్టెంబర్ మొదటి వారంలో, ఒకటవ తారీఖు నుండి మూడవ తారీకు వరకు సాంగ్లి – మహారాష్ట్రలో జరగనున్న నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ 2023-24 కాంపిటేషన్స్ కి లక్షెట్టిపేట గురుకుల బాలికల కళాశాల నుండి ఆరుగురు విద్యార్థినులు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ శ్రీమతి ఎం లలిత కుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 

MOST READ : 

  1. Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!
  2. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
  3. SONIYA : సోనియాతో ముగిసిన షర్మిల భేటీ.. తెలంగాణకా.. ఏపీకా..?
  4. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!

 

ఎంపికైన వారి వివరాలు ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ నుండి పీ. భూమిక,డీ. శాలిని,కే. స్పూర్తి, ఎం. స్నేహ, బైపిసి నుండి ఎస్. స్వాతి , డి. లక్ష్మీ ప్రసన్న ఇంటర్ రెండవ సంవత్సరము బైపిసి విద్యార్థినులు ఇట్టి జాతీయ స్థాయి ఛాంపియన్ షిప్ కాంపిటేషన్ లకు ఎంపికైన వారిలో ఉన్నారని, ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లలిత కుమారి తెలిపారు.

 

ఇట్టి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను తనతో పాటుగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే. మహేశ్వరరావు, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ ,జి. మౌనిక, పిడి శ్రీమతి ఎన్. మల్లిక, పిఈటి కుమారి ఎం. మమత. ఇతర ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారనీ ప్రిన్సిపల్ తెలియజేశారు.

మరిన్ని వార్తలు