Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట – ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

చింతపల్లి , మన సాక్షి

రైతు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండల పరిధిలోని కోర్మేడ్ ఎక్స్ వద్ద రైతుల సౌకర్యార్థం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల దళారుల మాటలు విని మోసపోవద్దని తాము పండించిన ప్రతి ధాన్యం గింజను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించి ఏ గ్రేడ్ ధాన్యానికి 20 60 రూపాయలు కామన్ గ్రేడ్ ధాన్యానికి 240 రూపాయల మద్దతు ధర రైతులు పొందాలన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు.

 

అవసరమైన గోనె సంచులు మ్యాచర్ మిషన్లు వేయింగ్ మిషన్ లతోపాటు అవసరమైన హమాలీలను సమకూర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వి సాగర్ రావు పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య

 

డి శేఖర్ రెడ్డి ఎంపిటిసి శ్వేత శ్రీశైలం గౌడ్ మండల బీసీ పిఎసిఎస్ డైరెక్టర్ అండే కార్ అశోక్ ఈరటి మల్లేష్ టిఆర్ఎస్ జిల్లా నాయకులు అండే కార్ వెంకటేష్ ఎస్కే చాంద్ పాషా నాది రమేష్ పూల యాదయ్య వ్యవసాయ శాఖ అధికారి కే రామలింగేశ్వర రావు నాదిరి శ్రీశైలం ముద్దం కృష్ణయ్య గౌడ్ కానుగుల ఆనంద్ నిరంజన్ గౌడ్ జి శ్రీనివాస్ రెడ్డి పిఎసిఎస్ సిబ్బంది రాజశేఖర్ రెడ్డి రంగనాథ్ రెడ్డి అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు