Dogs : వీధి శునకాలు ఇక అనిమల్ బర్త్ సెంటర్ కు..!
Dogs : వీధి శునకాలు ఇక అనిమల్ బర్త్ సెంటర్ కు..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
శంకర్‌పల్లి పట్టణంలోని 11, 14, 15 వార్డులలో, ఎమ్మార్వో ఆఫీస్ వెనకాల విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది సోమవారం ఎనిమల్ బర్త్ సెంటర్ కు తరలించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శంకర్‌పల్లి మున్సిపల్ కు, బ్లూ క్రాస్ సొసైటీ హైదరాబాద్ వారికి మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారని తెలిపారు.
వీధి శునకాలపై ఇప్పటికే కౌన్సిల్ లో చర్చించామన్నారు. రూ.8.75 లక్షలతో బ్లూక్రాస్ సొసైటీ తో ఒప్పందం చేసుకున్నాం అని, కుక్కల తరలింపు కార్యక్రమాలు నిరంతరంగా సాగుతున్నాయి అని తెలిపారు. ఒక్కో కుక్క తరలింపు కోసం రూ.1,650 వెచ్చిస్తున్నాం అని పేర్కొన్నారు.
గత నెల రోజుల నుండి పట్టణ పరిధిలో గల వీధి కుక్కలను స్టెరిలైజేషన్ ఏ ఆర్ వి ఇంజక్షన్స్ (యాంటీ రేబిస్ వ్యాక్సిన్) కొరకు అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లకు తరలిస్తున్నామని తెలిపారు. కుక్కలకు ఇంజక్షన్ చేసి తిరిగి పట్టణంలోనే వదిలివేయడం జరుగుతుందన్నారు.
ఈ ఇంజక్షన్ చేసిన కుక్కలు విపరీతంగా ప్రవర్తించే లక్షణాలు తగ్గుతాయని, కుక్కలు కరవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. వాక్సినేషన్ చేసిన కుక్కలకు గుర్తుగా చెవి వద్ద వి షేప్ కటింగ్ చేసి ఉంటుందన్నారు.
కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు సృష్టించకుండా ఉండాలని కుక్కలను తరలించడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు వారి వారి కాలనీలలో కుక్కల బెడద ఉన్నట్లయితే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
మున్సిపల్ కార్యాలయానికి సెలవు ఉన్న రోజులలో కూడా ప్రజల కొరకు మున్సిపల్ సిబ్బంది కష్టపడుతున్నారని తెలిపారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే స్పందిస్తున్న కమిషనర్ శ్రీనివాస్ ను, సిబ్బందిని పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.
LATEST UPDATE :
Good News : షెడ్యూల్ తెగలకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం చేయూత..!
HYDRA : హైడ్రా దూకుడు.. నెక్స్ట్ అనురాగ్..?
తెలంగాణలో 10,594 వీఆర్వోల నియామకం.. నోటిఫికేషన్..!
Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!









