Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా
Suryapet :వీధి కుక్కల దాడి.. 30 గొర్రెల మృతి..!
Suryapet :వీధి కుక్కల దాడి.. 30 గొర్రెల మృతి..!
అర్వపల్లి, మన సాక్షి :
గొర్రెల మంద పై వీధి కుక్కలు దాడి చేసి 30 గొర్రెలను చంపేసిన సంఘటన సూర్యాపేట జిల్లా జాగిరెడ్డిగూడెం కేంద్రంలో ఆదివారం జరిగింది. బాధిత గొర్రెల కాపరి మెరుగు దేవయ్య మాట్లాడుతూ, తన జీవన ఆధారంగా సాదుకుంటున్న గొర్రెల మందను ఇంటి పక్కన ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాడు. గ్రామంలోని వీధి కుక్కలు గొర్రెల మంద పై పడి 30 గొర్రెలను చంపి వేసినట్లు తెలిపాడు.
గొర్రెపోతులు, సూడి గొర్రెలు, చనిపోవడంతో జీవన భృతి లేకుండా పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. దాదాపు 3 లక్షల రూపాయల విలువ గల గొర్రెలు మృతి చెందినట్లు తెలిపారు. ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం చేసి సహాయ పడాలని కోరారు. గొర్రెల మంద మృతితో దేవయ్య కుటుంబం తీవ్ర సోకసముద్రంలో మునిగిపోయారు.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల పరిమితి ఎంత.. పెంచుకోవచ్చా.. తెలుసుకుందాం..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు మూడు జాబితాలు.. అవేంటో తెలుసా.. ఇలా చెక్ చేసుకోండి..!
-
Indiramma Indlu : మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా.. లేదా.. మీ ఫోన్లోనే ఇలా చెక్ చేసుకోండి..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఏడీఈ..!









