విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కావొద్దు
విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కావొద్దు
చౌటుప్పల్. మన సాక్షి.
మోటివేషనల్ స్పీచెస్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచేటట్లు, వారు మానసికంగా ఒత్తిడికి లోను కాకుండా చదువులో అభివృద్ధి చెందేటట్లు ఉత్తమ పౌరులుగా మారడం కోసం కృషి చేస్తానని ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ విశ్వనాధుల శంకరాచారి అన్నారు.
ఎందరో సాధారణ వ్యక్తులను అసాధారణ ప్రతిభగల వక్తలుగా తయారు చేస్తున్న ప్రముఖ సైకాలజిస్ట్ ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గురూజీ గంపా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో భాగంగా నిర్వహింపబడుతున్న, ట్రైన్ ది ట్రైలర్ వర్క్ షాప్ 74 ఇంపాక్ట్ సర్టిఫైడ్ కోర్సును 36 రోజులు ఆన్లైన్ ద్వారా మరియు రెండు రోజులు మినర్వా గ్రాండ్ హోటల్ లో గంప నాగేశ్వరావు, ఇన్చార్జి డాక్టర్ ఆదినారాయణ మరియు ఏడు మంది మెంటర్స్ సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల నుండి 71 మంది ట్రైనింగ్ తీసుకోవడానికి రాగా 36 గంటల పాటు ఆఫ్ లైన్ శిక్షణ పూర్తి చేసుకొని అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇన్ఫాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ సర్టిఫికెట్ పొందిన సందర్భంగా శంకరాచారి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన యొక్క సేవలను ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థుల కోసం ఉపయోగిస్తానని అన్నారు. ట్రైనింగ్ సర్టిఫికెట్ను వ్యవస్థాపకులు గంప నాగేశ్వరావు ,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కో ఇన్చార్జి సుధీర్ ఎస్ రాములు, పెరుమాండ్ల శ్రీనివాస్, రాజేశ్వరి, మమత, కె.వి సురేష్ కుమార్, త్రినాథ్ దాసరి, ఓంకారేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.









