Uniforms : విద్యార్థులకు అందని యూనిఫామ్స్..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మొత్తం విద్యార్థులు 540 మంది ఉండగా 272 మంది బాలికలకు మాత్రమే యూనిఫామ్ పంపిణీ చేశారు.

Uniforms : విద్యార్థులకు అందని యూనిఫామ్స్..!

కంగ్టి, మన సాక్షి :-

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సగం మంది విద్యార్థులకే యూనిఫామ్స్ అందాయి. మొత్తం విద్యార్థులు 540 మంది ఉండగా 272 మంది బాలికలకు మాత్రమే యూనిఫామ్ పంపిణీ చేశారు. 240 మంది బాలురకు నేటి వరకు యూనిఫామ్ అందించలేదు రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి అధికారులకు యూనిఫామ్ దుస్తుల టెండర్ అప్పగించగా పంపిణీలో జాప్యం జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

పంపిణీ లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు విద్యార్థులు సివిల్ యూనిఫామ్ తో పాఠశాలకు వస్తున్నారని మన సాక్షి రిపోర్టర్ చూసి విద్యార్థులు అడిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి : 

Ktr, Somireddy : మీ కళ్ళకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది.. కేటీఆర్ పై సోమిరెడ్డి ఫైర్..! 

Viral : ప్రధానోపాధ్యాయుడికి ప్రేమ జ్వరం.. టీచర్ ని పైకి లేపి మరీ అలా.. (వీడియో వైరల్)