Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లావిద్య

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తయారు కావాలి

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తయారు కావాలి

చౌటుప్పల్, మన సాక్షి :

భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి, ప్రపంచ వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేత, అన్నిటికి మించి భారతరత్నగా పేరుగాంచిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నారు అని ఈ రోజునే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం అని గ్రీన్ గ్రోవ్ పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

 

స్థానిక పురపాలక కేంద్రంలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులు తమ సొంత పరిజ్ఞానంతో తయారు చేసిన సైన్స్ పరికరాలను ప్రదర్శించి అవి ఎలా పని చేస్తాయో సందర్శకులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ..

 

 

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ ప్రయత్నాలను ప్రోత్సహించడానికి, గుర్తించటానికి అలాగే ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం నేడు ఎంతో అవసరమని అన్నారు. సి.వి.రామన్ శాస్త్రవేత్త, వైద్యుడు కావడంవలన రామన్ ఎఫెక్ట్ ను కనుక్కోగలిగాడని విద్యార్థులకు తెలిపారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న సైన్స్ విలువలను గౌరవించడానికి మరియు మానవజాతి జీవన విధానంపై అవి చూపే ప్రభావాన్ని గుర్తు చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులను గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

 

విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపి విద్యారంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తాయని అన్నారు. విద్యార్థుల శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఎంతోమంది శాస్త్రవేత్తల జీవితాలు వారి జీవిత చరిత్రలు పుస్తకా రూపంలో పొందుపరిచి ఉన్నాయని వాటిని చదివి గొప్ప శాస్త్రవేత్తలుగా తయారు కావాలని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు తమ సొంత పరిజ్ఞానంతో తయారుచేసిన సైన్స్ పరికరాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షించాయి. తమ పిల్లలు తయారు చేసిన వస్తువులను చూసి వారికి కృషికి తోడ్పాటు అందించిన ఉపాధ్యాయులను అభినందించారు.

 

9వ తరగతి విద్యార్థి ఏ కార్తీక్ తయారుచేసిన లేజర్ సెక్యూరిటీ అలారం, అలాగే ఎం అక్షర, బి వైష్ణవి తయారుచేసిన డి విటమిన్ హౌస్ అందర్నీ ఆకర్షించాయి. విద్యార్థుల సృజనాత్మకతను చూసి ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ ఎల్ సతీష్ రెడ్డి, ఎస్ లక్ష్మి, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు