విద్యార్థుల లో పోరాట శక్తి ని నింపేందుకే క్రీడా పోటీల నిర్వహణ – మంత్రి జగదీశ్ రెడ్డి
విద్యార్థుల లో పోరాట శక్తి ని నింపేందుకే క్రీడా పోటీల నిర్వహణ – మంత్రి జగదీశ్ రెడ్డి
త్వరలో నియోజకవర్గ యువత కు క్రీడా పోటీలు నిర్వహిస్తాం
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట , మనసాక్షి
సూర్యాపేట నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం జూనియర్ , సీనియర్ విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను
జీ. జే.ఆర్ కప్ పేరు తో మండల, సూర్యాపేట నియోజకవర్గ స్థాయిలో బాల, బాలికల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో నిన్నటి నుండి కొనసాగుతున్నాయు. బుధవారం జూనియర్ కళాశాల లో క్రీడా పోటీల ను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా క్రీడలు ఆడుతున్న తీరును తిలకిస్తూ చప్పట్లతో విద్యార్దినీ, విద్యార్దులను ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలను వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జీవితానికి విధ్య తో వెలుగు లభిస్తే క్రీడలతో పోరాట స్పూర్తి లభిస్తుందని అన్నారు. జీవితం లో ఓటమిని తట్టుకుని తిరిగి గెలుపోందాలంటే క్రీడా స్పూర్తి అవసరం అన్నారు.విధ్య తో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే బీ ఆర్ ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్న మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తోనే తెలంగాణ రాష్ట్రం లో క్రీడలకు ప్రాధాన్యం లభిస్తుంది అన్నారు.
పిల్లల సమగ్ర అభివృద్ది లో క్రీడలు ముఖ్య భాగం అని తెలిపారు. క్రీడల ద్వారా ఓటమి నుండి తిరిగి గెలుపొందాలనే స్పూర్తి విద్యార్ధుల ను జీవితంలో లో కష్టాలు వచ్చినపుడు వాటికి ఎదురీది ఉన్నత శిఖరాలను అధిరోహించెలా చేస్తుంది అన్నారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థ లో క్రీడలకు సరైన ప్రాధాన్యత లేక పోవడం వల్లే విద్యార్థులలో క్రీడా స్పూర్తి కొరవడి ప్రతీ చిన్న విషయానికి తట్టుకోలేకే జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
జాతికి అమూల్య సంపద అయిన చిన్నారుల ఆరోగ్యం విషయం లో దృష్టి పెట్టవలసిన అవసరం ప్రతీ ఒక్కరి పైన ఉందని అన్నారు. క్రీడలు పిల్లల శారీరక, మానసిక దృఢత్వాన్ని ఎంత గానొ దోహద పడతాయని అన్నారు. ఈ మేరకు పిల్లల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచన మారాలని అన్నారు. క్రీడలలో రాణించండం ద్వారా విధ్య లో సైతం పిల్లలు మంచి ప్రతిభ ను కనబరుస్తారనీ మంత్రి అన్నారు. పిల్లల సమగ్ర అభివృద్ది లో క్రీడలు ముఖ్య భాగం అన్నారు. ప్రస్తుత కాలం లో మొబైల్ గేమ్ లకు పరిమితమై క్రీడలకు దూరమవుతున్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. కార్పొరేట్ స్కూల్ లలో విద్యార్డుల ఆత్మహత్యల కు కారణం క్రీడలు లేక పోవడమే అని అన్నారు.పిల్లలకు క్రీడల పై ఆసక్స్తిని పెంచి మానసికంగా , శారీరకంగా దృఢం అవ్వడం కోసమే క్రీడలను నిర్వహిస్తున్నామని అన్నారు.
మంచి సమాజ నిర్మాణ ప్రక్రియ లో క్రీడా సంస్కృతీ ఉత్తమంగా దోహద పడుతుందని అన్నారు. దేశం లో క్రీడా విధ్య కు తగిన బడ్జెట్ కల్పించే విషయం లో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందన్నారు. దేశాన్నీ పాలిస్తున్న పాలకుల వైఫల్యం వల్లే, అతిపెద్ద జనాభా కలిగిన మన దేశం ఒలంపిక్స్ వంటి క్రీడా ఈవెంట్ల అట్టడుగున ఉండటానికి కారణం అన్నారు. పోటీల లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిపబ్లిక్ డే రోజున బహుమతులు అందజేస్తామని మంత్రి అన్నారు.
యువత కోసం త్వరలో క్రీడల నిర్వహణ
రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్దులకు నిర్వహించిన క్రీడల మాదిరిగానే త్వరలో యువత కోసం కూడా క్రీడలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.ఏర్ క్రీడలను గ్రామాల వారీగా, మున్సిపాలిటీ లో వార్డ్ ల వారీగా నిర్వహించి అక్కడ గెలుపొందిన వారికి నియోకవర్గస్థాయిలో పోటీలను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.









