Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లావిద్య

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

వలిగొండ , మనసాక్షి:

వలిగొండ మండల పరిధిలోని
పులిగిల్ల ప్రాథమిక పాఠశాల నందు స్వపరిపాలన దినోత్సవాన్ని విద్యార్థినీ విద్యార్థులు పాఠశాల సిబ్బంది కలిసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఒక్కరోజు విధులను చక్కగా నిర్వహించారు.

 

జిల్లా విద్యాశాఖ మంత్రిగా వరికుప్పల ప్రణీత్ రాజు, ఎమ్మెల్యేగా వరికుప్పల మణికంఠ, కలెక్టర్ గా వేముల భూమిక, జిల్లా విద్యాశాఖ అధికారిగా కళ్లెం నవ్య ఎంపీడీవో గా మారబోయిన స్టాలిన్ మండల విద్యాశాఖ అధికారిగా వరికుప్పల శివదుర్గరాజు ఎమ్మార్వో గా ఎత్తరి రాజశేఖర్ సర్పంచిగా బల్లెపు చరణ్ మిగతా విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడం జరిగింది .

 

ఒక్కరోజు ఉపాధ్యాయులు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల పాత్రలలో ఎంతో చాక చక్యాన్ని చురుకుదనాన్ని విద్యార్థులు ప్రదర్శించారు.విద్యార్థిని విద్యార్థులు నిర్వర్తించిన బాధ్యతల ప్రకారంగానే భవిష్యత్తులో వారి కలను సాకారం చేసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొల్లం శ్రీనివాస్ ఉపాధ్యాయులు పలమల జనార్ధన్ మరియు దొడ్డి స్వర్ణలత విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు