అడవిదేవులపల్లిలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..!

అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన ఏకుల ఉపేందర్  (24) ఆటో డ్రైవరు మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినాడు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం..

అడవిదేవులపల్లిలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య..!

అడవిదేవులపల్లి , మన సాక్షి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన ఏకుల ఉపేందర్  (24) ఆటో డ్రైవరు మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినాడు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపేందర్ అనే అతను బుధవారం రాత్రి  10 గంటల సమయంలో మద్యంకు అలవాటు పడి ప్రతి రోజు త్రాగుతున్నాడు.

కుటుంబసభ్యులు మందలించగా మనస్తాపంతో పురుగుల మందు తాగాడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

చికిత్స పొందుతూ గురువారం రాత్రి 1.10 గంటల సమయంలో మరణించాడు. మృతుని అన్న ఏకుల మహేశ్ ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి, పోస్ట్ మార్టం అనంతరం మృత దేవహంను బందువులకు అప్పగించి విచారణ చేస్తున్నామని ఎస్ఐ హరిబాబు తెలిపారు.

ALSO READ : తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!