పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

క్షణిక ఆవేశంతో తమ జీవితాలను యువత అంతం చేసుకుంటున్నసంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య

అర్వపల్లి, మన సాక్షి :

క్షణిక ఆవేశంతో తమ జీవితాలను యువత అంతం చేసుకుంటున్నసంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన చింతల పూజిత ( 17) తల్లి మందలించిందన్న కోపంతో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం జరిగింది.

ALSO READ : Free Bus Travel : ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త నిబంధనలు.. పాటించకపోతే రూ 500 ఫైన్..!

మృతురాలు తండ్రి యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం ఇంటర్మీడియట్ చదువుతున్న కూతుర్ని ఇంట్లో పని చేయమని అన్నందుకు పురుగుల మందు తాగినట్టు తెలిపారు.

సూర్యాపేట ప్రైవేట్ ఆస్పత్రి తరలించి వైద్యం నిర్వహించగా నయం కాకపోవడంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : IMP NEWS : పేపర్,  పాలు డెలివరీ చేసే వాళ్ళని ఇంటికి రావద్దని చెప్పాలి..!