Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ..!

అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ..!

టేక్మాల్, మన సాక్షి

మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కాదులూరు గ్రామంలో అంగన్వాడి సూపర్వైజర్ కృష్ణవేణి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్ పట్టికను చూడడం జరిగింది.

అనంతరం ఆమె మాట్లాడుతూ , కిషోర బాల బాలికలకు సరైన పోషక ఆహారం పాలు, గుడ్లు, బాలామృతం, మురుకులు,పెట్టాలని, గర్భిణీ స్త్రీలకు ఆకుకూరలు, పోషక పదార్థాలు తినే విధంగా పలు సూచనలు చేసింది.

అంగన్వాడి కేంద్రాలలో కిషోర్ బాల బాలికలను సమయానికి తీసుకువచ్చి సరైన సమయనికి ఇంటికి పంపించాలని, అంగన్వాడి పిల్లలు తమ సొంత పిల్లల్లాగా చూసుకోవాలని, తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ లక్ష్మి,జయరణి, కంసమ్మ, ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు