Suryapet : సుందర నగరం సూర్యాపేట

సుందర నగరం సూర్యాపేట

తలమానికంగా మెడికల్ కాలేజ్, సద్దుల చెరువు టాంక్ బండ్
సూర్యాపేట అభివృద్ధి లో మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి

తెలంగాణ రాకముందుకు గందరగోళంగా ఉన్న సూర్యాపేట పట్టణం నేడు సుందరమైన , సుసంపన్న పట్టణం గా పరిఢవిల్లుతున్నది. సూర్యాపేట ను టాప్ నగరంగా పూల వనం లా మారుస్తాను అని 2018 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ను నందన వనం లా మార్చారు. విదేశాల్లో ను ,ఇతర ప్రాంతాల్లో ఉంటూ చాలా రోజుల తరువాత తమ స్వస్థలానికి వచ్చిన సూర్యాపేట వాసులే ఇది మా సూర్యాపేట నేనా అంటూ అబ్బురపడుతున్నారు.

 

2014 ముందు ఉన్న సూర్యాపేట పట్టణం జగదీశ్ రెడ్డి శాసన సభ్యులు అయిన తరువాత పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కన్పిస్తున్నది. దూరప్రాంతాల నుంచి వచ్చిన ఎవరైనా సూర్యాపేట కు కొత్తగా చూస్తే ఇది అప్పటి సూర్యాపేట నేనా అని ఆశ్చర్యపోక తప్పదు. మేయిన్ రోడ్డు విస్తరణ,, చర్చ్ కాంపౌండ్ రోడ్డు విస్తరణ, నాలా నిర్మాణం, నగరంలో అంతర్గత రోడ్ల నిర్మాణం చూసిన ఎవరికైనా అభివృద్ధిలో తేడా కన్పించక మానదు.

 

అంతేకాకుండా సూర్యాపేట ముఖ ద్వారం ధర్మ బిక్షం చౌక్ (ఎన్టీఆర్ పార్క్) వద్ద నిర్మించిన మెడికల్ కాలేజ్ పట్టణానికే తలమానికంగా మారింది. దీనంతటికీ ప్రధాన కారణం కార్యదీక్షత, పట్టుదల, అభివృద్ధి చేయాలనే తపన ఉన్న నాయకుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉండటము , మంత్రి జగదీశ్ రెడ్డి కి మంత్రి కేటీఆర్‌తో ఉన్న సన్నిహితంతోపాటు సీఎం కేసీఆర్‌ చంద్రశేఖర్‌రావుతో ఉన్న అవినాభావ సంబంధం రీత్యా సూర్యాపేట అభివృద్ధికి వరదలా నిధులు వచ్చిపడుతున్నాయి.

 

దీనికితోడు సమర్ధవంతమైన అధికార యంత్రాంగం ఉండడంతో సూర్యాపేట జి అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఆహ్లాదపరుస్తున్న పూల మొక్కలు, పార్కులు, పార్కులు పట్టణ వాసులను ఆహ్లాదపరుస్తున్నాయి. సద్దుల చెర్వు ట్యాంక్‌బండ్‌, దిగువన ఏట వాలుగా కట్ట పొడవునా నిర్మించిన ఉద్యానవనం పేట వాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది.

 

చెరువు మధ్య లొ 100 అడుగుల ఎత్తు లొ నిర్మిత మవుతున్న పైలాన్ పనులు శర వేగంగా సాగుతున్నాయి. చెరువులో నీళ్లు.. పక్కన ట్యాంక్‌బండ్‌ ఆహ్లాదపరుస్తున్నది. ఆదివారంతోపాటు ప్రతి సెలవు దినాల్లో పట్టణ వాసుల రాకతో టాంక్ బండ్ కోలాహలంగా మారుతున్నది.

 

పిల్లలు, పెద్దలు, వృద్ధులు సాయంత్రం వేళల్లో ఎంతో సంతోషంగా ఇక్కడ గడుపుతున్నారు. అదేవిధంగా ఎం.జి రోడ్, మెయిన్ రోడ్, చర్చ్ కాంపౌండ్, కల్నల్ సంతోష్ చౌరస్తా నుండి రాఘవ ప్లాజా వరకు డివైడర్ ల మధ్య లొ పూల మొక్కలు,గ్రీనరీలు పట్టణ వాసులను ఆహ్లాద పరుస్తున్నాయి. ఆకట్టుకుంటున్నాయి.

 

పట్టణం లొ ఉన్న అనేక పార్కులు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం వేళల్లో మహిళలు, చిన్నారులతో ఈ పార్కులు కిటకిటలాడుతున్నాయి.

 

సూర్యాపేట లో ఆ మాత్రం ఎట్రాక్షన్ లెకపోతే ఎలా..

ఆకట్టుకుంటున్న వాల్‌ స్ట్రీట్‌ ఆర్ట్‌

మహా నగరాలు ,విదేశాల్లో ముఖ్యంగా టూరిస్ట్‌ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే వాల్‌ పెయింటింగ్స్ ఇప్పుడు సూర్యాపేట పట్టణంలో ను కనువిందు చేస్తున్నాయి. పాదచారులు నడుస్తూ వెళ్తున్నప్పుడు.. వాహనదారులకు ఆహ్లాదంగా ఉండేందుకు..మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి వచ్చేవారిని ఆకర్షించేందుకు ఈ వాల్‌ స్ట్రీట్ ఆర్ట్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

 

సూర్యాపేట శాసన సభ్యులు, మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక చొరవ తో సూర్యాపేట లో కూడా ఇప్పుడు ఈ వాల్‌ పెయింటింగ్‌ ఆర్ట్‌ ఊపందుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యం ల కొత్త బస్టాండ్, ఖమ్మం ఫ్లై ఓవర్ ల పై కళాకారులు ప్రధాన రహదారుల్లో ఉన్న గోడలపై రూపొందించిన ప్రత్యేకమైన చిత్రాలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి.