సూర్య క్షేత్రాన్ని సందర్శించిన మలేషియా బృందం

సూర్య క్షేత్రాన్ని సందర్శించిన మలేషియా బృందం

అర్వపల్లి, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్రంలోనే తొలి సౌర క్షేత్రంగా విరాజిల్లుతు ఆనతి కాలంలోనే ప్రాచుర్యం పొందిన అ ఖండ జ్యోతి స్వరూప సూర్య దేవాలయాన్ని మంగళవారం మలేషియా బృందం సభ్యులు సందర్శించారు.

మండల పరిధిలోని తిమ్మాపురం శివారు శ్రీపురంలో వెలసిన ఖండ జ్యోతి స్వరూప సూర్య దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాక దేశంలో నలుమూలల నుండి భక్తులు వస్తున్నారు.

మంగళవారం హోలీ పండుగ సందర్భంగా మలేషియా నుండి వచ్చిన భక్త బృందం సూర్య దేవాలయాన్ని దర్శించుకున్నారు సూర్య భగవానుడు ఉషాదేవి ఛాయాదేవిలా కు ప్రత్యేక పూజలు నిర్వహించారు

 

 

ఆలయ వ్యవస్థాపకుడు కాకులారపు జనార్దన్ రెడ్డి ఆలయ విశిష్టత ను సూర్య భగవానుని గురించి వారికి తెలియజేయడం జరిగింది హిందూ దేవుళ్ళని సాంప్రదాయాలను సంస్కృతిని గౌరవిస్తామని బృందం సభ్యులు తెలిపారు