Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : ఆటో నగర్‌ ఏర్పాటు పనులు వేగవతం చేయాలి..!

Suryapet : ఆటో నగర్‌ ఏర్పాటు పనులు వేగవతం చేయాలి..!
సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు   
సూర్యాపేట రూరల్, మనసాక్షి:
ఆటో నగర్‌ ఏర్పాటు పనులు వేగవతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకటరావు తెలిపారు. నివారం సూర్యాపేట మండల పరిధిలో  ఇమాంపేటలో గల ఆటో నగర్, ఇండస్ట్రియల్‌ పార్కుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆటోనగర్‌కు ఇప్పటికే కొంత భూమిని కేటాయించామని, ఇండస్ట్రీయల్‌ పార్కు కొరకు కొంత భూమిని రైతుల నుండి సేకరించాల్సి రాగా కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో ఏర్పాటు పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు.
కోర్టులో ఉన్న భూములకు కౌంటర్‌ ఫైల్‌ చేయాలని ఆర్డీవోను ఆదేశించినట్టు కలెక్టర్‌ తెలిపారు.  ఈనెల 27న రెవెన్యూ, తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్ఫోస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ అధికార జోనల్‌7 మేనేజర్‌తో  సమావేశం ఏర్పాటు చేశామని,  ఈ సమావేశానికి లేఔట్స్‌ సిద్దం చేసుకుని వస్తారన్నారు.  వెంటనే పనులు ప్రారంబిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు