Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : లంచాలు తీసుకొని ఆస్పత్రిలో ఉద్యోగాలు.. ఆందోళన..!

Suryapet : లంచాలు తీసుకొని ఆస్పత్రిలో ఉద్యోగాలు.. ఆందోళన..!

సూర్యాపేట ,మనసాక్షి:

సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ దండ మురళీధర్ రెడ్డి తన గ్రామానికి చెందిన వారికి డబ్బులు తీసుకొని అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తూ శుక్రవారం జిల్లా ఆసుపత్రి ముందు కొంతమంది ఆయన చేతిలో మోసపోయిన బాధితులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆసుపత్రిలో సూపర్ రిండెంట్ గా పని చేస్తూ ప్రజాధనాన్ని దోచుకు తిన్నారని ఆరోపించారు.

ఆసుపత్రిలో మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లను తన కుటుంబ సభ్యులకు బంధువులకు ఇప్పించి లక్షల్లో దోచుకున్నాడని అన్నారు.  అవినీతి జలగను ఆదాయపన్ను వారు పట్టుకునేందుకు ఇటీవల అనేకమార్లు తప్పించుకున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి అవినీతిపరుడు ఇతర ప్రాంతానికి బదిలీ అయితే రాజకీయ జోక్యంతోనే బదిలీ అయ్యాడు అంటూ కొంతమందిని ఉసిగొలిపి ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.బదిలీ సక్రమమేనని దీంతో సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి పట్టిన అవినీతి మచ్చ తొలగిందన్నారు.

అన్ని ఆధారాలతో గతంలో ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని అయినా ఏ మాత్రం పట్టించు పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న తమను అకారణంగా తొలగించారని తమ గ్రామస్తులను అనుచరులుగా మార్చుకొని తనకు అనుకూలంగా ధర్నాలకు చేయించుకోవడం సిగ్గుచేటు అన్నారు.అవినీతిపరుడైన డాక్టర్ దండ మురళీధర్ రెడ్డిని బదిలీ చేయడం కాదని ఏకంగా సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ALSO READ :

Liquor Scam : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ కార్యకర్తల ఆందోళన..!

Murder : ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితుడు ఎన్ కౌంటర్..!

BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు