Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
సూర్యాపేట : నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ వెంకట్రావు
సూర్యాపేట : నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం
వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ వెంకట్రావు
సూర్యాపేట, మనసాక్షి
సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. శనివారం ఉదయం సూర్యాపేటలోని కుడ కుడ ప్రాంతాల్లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. అంతస్తుల వారిగా జరుగుతున్న పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలన్నారు.
నిర్మితమవుతున్న అన్ని గదులను నిశితంగా పరిశీలించారు.. పనులు వేగవంతంగా చేసె విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మే చివరి నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రోడ్ల భవనాల శాఖ డి ఈ మహిపాల్ రెడ్డి, జె ఈ యుగేంధర్, గుత్తేదారు, సైట్ ఇంజనీర్ కిషోర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.









