సూర్యాపేట : విధులలో ఆలస్యం వహిస్తే ఉపేక్షించేది లేదు : జిల్లాకలెక్టర్

సూర్యాపేట : విధులలో ఆలస్యం వహిస్తే ఉపేక్షించేది లేదు : జిల్లాకలెక్టర్

అనంతగిరి , మన సాక్షి

అనంతగిరి మండలంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఆయన పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మండల వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఎంపీడీవో విజయని అడిగి తెలుసుకున్నారు.

 

గ్రామాలలో పారిశుద్ధం శుభ్రంగ ఉంచాలనిసీజన్ వ్యాధులు రాకుండా గ్రామ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో వీధి వీధిన తిరుగుతూ శిధిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే కూల్చేసే చర్యలు తీసుకోవాలనితిరిగి వారికి అవగాహన కల్పించాలని అన్నారు.ప్రస్తుత తీవ్ర వర్షాల దృష్ట్యా పాలేరు వాగు కు ఆనుకొని ఉన్న గ్రామాల తో పాటు కాలువలు పొంగిపొర్లి అవకాశం ఉన్నందున ప్రజలకు తగిన జాగ్రత్తలు ఇవ్వాలని తహసిల్దార్ సంతోష్ కిరణ్ కు ఆదేశించారు.

 

ALSO READ : 

  1. TSRTC : నిరుద్యోగుల గుడ్ న్యూస్ : టిఎస్ ఆర్టీసీలో ఐటిఐ దరఖాస్తులకు ఆహ్వానం..!
  2. Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
  3. Tweet : హలో మేడమ్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ల వెల్లువ.. !

 

అనంతరం శిథిలావస్థలో ఉన్న అనంతగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీ చేశారు. శిధిలావస్థలో ఉందని వర్షం వస్తే విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతుందని గ్రామ సర్పంచ్ వినేపల్లి వెంకటేశ్వరావు కలెక్టర్ తెలిపారు తప్పనిసరిగా త్వరగా పాఠశాల నిర్మాణం జరిపేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ కి కలెక్టర్ హామీ ఇచ్చారు.

 

మండల వ్యాప్తంగా మన ఊరు మనబడి ప్రణాళిక పనులు జరుగుతున్న విధానాన్ని ఏ హర్షను అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదని తక్షణమే సమస్యను పరిష్కరించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని మండల పంచాయతీ కార్మికులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.

 

ఇదిలా ఉండగా కలెక్టర్ పర్యటన ఉందని తెలిసి కూడా పలువురు అధికారులు హాజరు కాకపోవటంతో వారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.