Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : తలకిందులుగా జాతీయ పతాకావిష్కరణ.. మండిపడ్డ ప్రజాప్రతినిధులు, ప్రజలు..!

మండల పరిధిలోని అనంతారం పశువైద్య దవఖానలో సోమవారం గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగరవేశారు. స్థానిక ప్రజాప్రతినిధు లు అధికారిని నిలదీశారు.

Suryapet : తలకిందులుగా జాతీయ పతాకావిష్కరణ.. మండిపడ్డ ప్రజాప్రతినిధులు, ప్రజలు..!

పెన్ పహాడ్. మన సాక్షి.

మండల పరిధిలోని అనంతారం పశువైద్య దవఖానలో సోమవారం గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగరవేశారు. స్థానిక ప్రజాప్రతినిధు లు అధికారిని నిలదీశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ సర్పంచ్. శోభ. ఉప సర్పంచ్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి. వార్డు సభ్యులు. మాజీ సర్పంచులు. మాజీ ఎంపిటిసిలు. మాజీ సింగల్ విండో వైస్ చైర్మన్. మాజీ డైరెక్టర్లు. ఉపాధ్యాయులు కలిసి గణతంత్ర పశు వైద్యశాలకు వెళ్లారు.

రెగ్యులర్ వైద్యాధికారి సెలవు పై వెళ్ళాడు. దీంతో వి ఎల్ వో ( వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్) షేక్ సత్తార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నందున జాతీయ జెండాను తలకిందులుగా కట్టి పతావిష్కరణ చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ప్రజా ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు.

అయినా తలకిందుగా ఉన్న జాతీయ జెండాను ఎగురవేశాడు. తమను అవమాన పరిచి మాట్లాడాడని సర్పంచ్. వార్డు సభ్యులు . మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అతనిపై గ్రామంలో సమగ్ర విచారణ జరిపి.చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజా ప్రతినిధులు. మాజీ ప్రజాప్రతినిధులు సంబంధించిన అధికారులను కోరుతున్నారు.

By : Nageshwar Rao, Penpahad 

ఇవి కూడా చదవండి

  1. Medaram : మేడారం సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు.. ప్రాంగణంలో హకా నృత్య ప్రదర్శన!

  2. ఆదివారం రధ సప్తమి.. మటన్, చికెన్ తినొచ్చునా..!

  3. BREAKING : దేవరకొండ – నల్గొండ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు..!

  4. Groundnuts : వేరుశనగకు రికార్డ్ స్థాయి ధర.. రైతులను సన్మానించిన మార్కెట్ కమిటీ..!

మరిన్ని వార్తలు