Suryapet : యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి..!
యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని, పార్టీకి యూత్ కాంగ్రెస్ నాయకులు చాలా ముఖ్యమని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.

Suryapet : యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి..!
ఏ ఐ సి సి సభ్యులు రాంరెడ్డి సర్వోతం రెడ్డి
సూర్యాపేట, మనసాక్షి:
యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని, పార్టీకి యూత్ కాంగ్రెస్ నాయకులు చాలా ముఖ్యమని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్ సేన్ మొరిశెట్టి నివేదిత లక్షాదిలు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను పేదలకు కేటాయించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 175 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు.
ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నూతనంగా జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ తరఫున బిఎల్ ఎ ల నియామకం జరిగిందని, ప్రతి బూతులో కూడా ఏ ఒక్క ఓటు కూడా తీసివేయకుండా పనిచేయాలని ఆయన అన్నారు. ఎస్ఐఆర్ పై పార్టీ పరంగా వస్తున్న సమాచారాన్ని పార్టీ కార్యకర్తలకు అందించాలని , ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో క్రియాశీలకంగా పనిచేయాలని అన్నారు.
యూత్ కాంగ్రెస్ పట్టణ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి మరియు గ్రామాలలో కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కార్యదర్శి పోస్టులకు యూత్ కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని తన తండ్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులను ఆదరించే వారిని, వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించారని తాను కూడా అదే బాటలో పయనిస్తాయని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫి వుల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరకుంట్ల వేణుగోపాల్ , జిల్లా కాంగ్రెస్ పార్టి కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలిమినేటి సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలి, పార్టీ నాయకులు వీరన్న నాయక్, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి ,అబ్దుల్ రహీం, కౌన్సిలర్ లు కొండపల్లి దిలీప్ రెడ్డి,, నాగుల వాసు, సునీల్ రెడ్డి , తన్వీర్ హుస్సేన్, పోలగాని బాలు గౌడ్, మహిళా కాంగ్రెస్ నాయకులు వేములకొండ పద్మ, శ్రావ్య రెడ్డి, బొడ్డు సాయి, జవహర్ తదితరులు పాల్గొన్నారు.










