Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

సైబర్ నేరగాళ్లు తో జాగ్రత్తగా ఉండాలి – ఎస్సై ముత్తయ్య

సైబర్ నేరగాళ్లు తో జాగ్రత్తగా ఉండాలి – ఎస్సై ముత్తయ్య

అర్వపల్లి, అక్టోబర్ 26, మన సాక్షి : మారుతున్న కాలానికి నేరగాళ్లు కూడా అనేక రకమైన కొత్త రకం నేరాలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని వారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని నాగారం ఎస్ఐ ముత్తయ్య అన్నారు.
పోలీస్ అమరవీరుల సస్మరణ దినోత్సవ ముగింపు సందర్భంగా సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని వర్ధమానుకోట హైస్కూల్లో విద్యార్థులకు సైబర్ నేరస్తుల గురించి తెలియజేశారు.
సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజల నుండి కలెక్టర్ ఎస్పీ స్థాయి అధికారులు కూడా మోసం చేస్తున్నట్లు తెలిపారు అలాంటి మోసం జరిగితే1930 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలిపితే పోయిన నగదును వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.

అలాగే విద్యార్థులకు మహిళలకు ప్రమాదం జరిగితే 100 నెంబర్కు డయల్ చేయాలని తెలిపారు కొత్త నెంబర్లకు ఓటిపి చెప్పొద్దని ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ లో ఏటీఎం కార్డులు ఎవరికి ఇవ్వొద్దని అన్నారు. పోలీసులు ప్రజారక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ప్రజలు పోలీసులతో సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ సి వెంకటయ్య పిసిలు నాగరాజు రమేష్ హెడ్మాస్టర్ శ్రీనివాస్ వెంకటనారాయణ నాగమణి జ్యోతి గోవర్ధన్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు