మిర్యాలగూడ : పోటీ పరీక్షల్లో విజేతలైన విద్యార్థులు వీరే..!

విద్యార్థులలో పోటీతత్వం పెరగాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దశరథ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో SVV ప్రసాద్ అధ్యక్షతన టాలెంట్ పరీక్షల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులు అన్ని రంగాలలో ప్రగతిని సాధించాలని కోరారు.

మిర్యాలగూడ : పోటీ పరీక్షల్లో విజేతలైన విద్యార్థులు వీరే..!

విద్యార్థులలో పోటీతత్వం ఉండాలి: ఎమ్మెల్యే బిఎల్ఆర్

మిర్యాలగూడ,  మన సాక్షి:

విద్యార్థులలో పోటీతత్వం పెరగాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దశరథ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో SVV ప్రసాద్ అధ్యక్షతన టాలెంట్ పరీక్షల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులు అన్ని రంగాలలో ప్రగతిని సాధించాలని కోరారు.

ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరవింద శర్మ మెమోరియల్ బెస్ట్ స్కూల్ అవార్డు జడ్పీహెచ్ఎస్ నందిపాడు ఎంపికైనది. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. గణేష్ పదివేల రూపాయల విలువైన స్పోర్ట్స్ మెటీరియల్ను సంస్థ ద్వారా స్వీకరించినైనది.

ALSO READ : Ys Sharmila : సాక్షి సంస్థలో నాకు సగ భాగం ఉంది.. ఏం పీక్కుంటారో పీక్కోండి, వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ప్రకటన.. !

టాలెంట్ టెస్ట్ లో గవర్నమెంట్ స్కూల్స్ విభాగంలో టౌన్ టాఫర్స్ : 
E. అక్షర X క్లాస్ జడ్పీహెచ్ఎస్ మిర్యాలగూడ క్యాష్ అవార్డు ₹ 1016/-
SK. సుభాని IX క్లాస్ జడ్పీహెచ్ఎస్ యాద్గారిపల్లి క్యాష్ అవార్డు ₹ 1016/-
Ch. భార్గవి VIII క్లాస్ జెడ్పిహెచ్ఎస్ బకల్వాడి మిర్యాలగూడ క్యాష్ అవార్డు ₹ 1016/-

ప్రైవేట్ స్కూల్స్ విభాగంలో టౌన్ టాపర్స్ : 

K. జీవన X క్లాస్ శివాని హై స్కూల్ మిర్యాలగూడ క్యాష్ అవార్డు ₹ 1016/-
J. కృతిక IX క్లాస్ ఎస్ పి ఆర్ స్కూల్ మిర్యాలగూడ క్యాష్ అవార్డు ₹ 1016/-
G సాయిచరణ్ రెడ్డి VIII క్లాస్ ఎస్పీఆర్ స్కూల్ మిర్యాలగూడ, క్యాష్ అవార్డు ₹ 1016/-

ALSO READ : KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!

ఈ ఫౌండేషన్ లాభాపేక్షలేని సంస్థగా విద్యార్థులకు వార్షిక పోటీలు నిర్వహిస్తున్నదని 2016-17 నుండి స్కాలర్షిప్ అవార్డులను అందజేస్తుందని నిర్వాహకులైన సంస్థ అధ్యక్షులు SVV ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె. సురేష్ కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిడమనూరు మండలం విద్యాధికారి బాలు నాయక్, 17వ వార్డు కౌన్సిలర్ రవి నాయక్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంస్థ సభ్యులు బాలునాయక్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.