సమాజ అభవృద్ధిలో ఉపాధ్యాయులు కీలకం
సమాజ అభవృద్ధిలో ఉపాధ్యాయులు కీలకం
ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి
ఇల్లంతకుంట, మన సాక్షి:
సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముస్కాని పేట గ్రామానికీ చెందిన విద్యార్థినీ విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సింగిరెడ్డి వీరారెడ్డి 5సైకిళ్లను పాఠశాలకు విరాళంగా ఇవ్వగా ఉపాద్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు చేతులు మీదుగా సైకిళ్లను పంపిణీ చేశారు.
ALSO READ :
- Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
- RTC : ఆర్ టి సి కార్మికుల విలీనం- ఆంధ్రప్రదేశ్ అనుభవాలు.. పుస్తకం ఆవిష్కరణ..!
దూర ప్రాంతాల నుండి నడచి వచ్చే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కునబోయిన భాగ్యలక్ష్మి బాల రాజు, పాఠశాలప్రధానోపాధ్యాయులు మహేష్ చంద్ర, పి అర్టీయూ నాయకులు మాన్వాడ శంకర్, పీఅర్టీయూ మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సందీప్ రెడ్డి, వెంకటేష్, వంశీదర్ రెడ్డి, కో అప్సన్ సభ్యులు సలీం, కిశోర్ గౌడ్, సత్యనారాయణ, బాబు, కాంప్లెక్స్ హెచ్ ఎం వెంకటేశ్వర రావు, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గోన్నారు.









